Thursday, March 12, 2026

ట్రాఫిక్ రూల్స్ మరియు సైబర్ క్రైమ్స్ పై ఓల్డ్ హై స్కూల్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జగిత్యాల టౌన్

(నేటి సాక్షి) పూరెళ్ల బాపు…..జగిత్యాల జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు స్థానిక ఓల్డ్ హై స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ మరియు సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ మాట్లాడుతూ విద్యార్థులు 18 సంవత్సరాలు దాటిన తరువాత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని వాహనాలు నడపాలని అదేవిధంగా హెల్మెట్ ధరించాలని కారులో వెళ్లేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలని ట్రాఫిక్ సిగ్నల్స్ పై అవగాహన కల్పించారు అదేవిధంగా టౌన్ ఎస్ఐ రవి కిరణ్ మాట్లాడుతూ విద్యార్థులు గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్ నుండి నుండి వచ్చిన లింకులు ఓపెన్ చేయవద్దని విద్యార్థులు ఫోటోలు స్టేటస్ లో గాని ఇంస్టాగ్రామ్ లో గాని పోస్ట్ చేయకూడదని పోస్ట్ చేసిన పక్షంలో ఏఐ ద్వారా మార్పింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉన్నందున ఫోటోలు పోస్ట్ చేయొద్దని వారన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు సూర్య ప్రకాష్ పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు బోయిని పెల్లి ఆనంద్ రావు ఉపాధ్యాయులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News