Friday, March 13, 2026

వికసిత్ భారత కు దిక్సూచి జాతీయ విద్యా విధానం

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నూతన ఉపకులపతి గా నియమితులైన ప్రొఫెసర్ తాతా నర్సింగ్ రావు గారిని ఈ రోజు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్సిక్ మహా సంఘం ( ఏ బి ఆర్ ఎస్ ఎం) ప్రతినిధులు జాతీయ సహ సంఘటన కార్యదర్శి శ్రీ గుంతా లక్ష్మణ్ జి గారి సమక్షంలో కలిసి ఉప కులపతి కి అభినందనలు తెలియజేసి సత్కరించటం జరిగింది. ఈ సందర్భంగా ఉపకులపతి ప్రొఫెసర్ నరసింగా రావు గారు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ఉప కులపతి గా నియమితులు కావటం తన అదృష్టం అని విశ్వవిద్యాలయాన్ని పరిశోధన ,విద్య ,ఉపాధి, నైపుణ్యం మొదలైన విభాగాలలో అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్ళడానికి అందరి సహాయ సహకారాలతో కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం వలన నేటి తరం విద్యార్థులకు ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా విద్య ఉపాధి, శిక్షణ నైపుణ్య రంగాలలో అత్యున్నత శిక్షణను అందించాలని, ఈ దిశగా విశ్వవిద్యాలయాలు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగినది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ప్రేయర్ వర్క్ ( ఏఎన్ఆర్ ఎఫ్) ద్వారా దాదాపు లక్ష కోట్ల నిధులను దేశంలో ఉన్నత విద్య విభాగములో పరిశోధన రంగాన్ని ప్రోత్సహించే దానికి కేటాయించిందని ఈ నిధులను పొందే దానికి ప్రతి విశ్వవిద్యాలయము వినూత్నమైనటువంటి రీసెర్చ్ ప్రపోజల్ తో ముందుకు వెళ్లాలని కోరారు. అదేవిధంగా ప్రధానమంత్రి రూసా పథకం కింద ప్రతి విశ్వవిద్యాలయానికి దాదాపు 100 కోట్ల నిధులను తరగతి గదులు, ప్రయోగశాలలు, వసతి గృహాలు మొదలైన వాటిని ఆధునికరించే దానికి మరియు నూతనంగా నిర్మించడానికి కేటాయించారని ఈ సదవకాశాన్ని ప్రతి రాష్ట్ర విశ్వవిద్యాలయాలు అందుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబిఆర్ఎస్ ఏం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ వై వి రామిరెడ్డి, కోశాధికారి ప్రొఫెసర్ ఎం రాజశేఖర్, ఇంజనీరింగ్ విభాగం కార్యదర్శి డాక్టర్ ఎన్ బాలసుబ్రమణ్యం, టీటీడీ విద్యాసంస్థల కన్వీనర్, ఎస్పీడబ్ల్యు పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం పద్మావతమ్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ జి వి రమేష్ బాబు, ఇంటర్మీడియట్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రియ వర్ధన బాబు, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ( ఆపస్) రాష్ట్రb అధ్యక్షులు శ్రీ పి .బాలాజీ మొదలగు వారు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News