Friday, March 13, 2026

అక్టోబర్ 18 బంద్ కు వ్యాపార, వాణిజ్య వర్గాలు సహకరించాలి -ఎం ఎల్ సి ఎల్ రమణ జగిత్యాల టౌన్

(నేటి సాక్షి)(పూరెళ్ల బాపు)………జగిత్యాల జిల్లా బి ఆర్ యస్ పార్టీ కార్యాలయం లో పత్రిక విలేఖరుల సమావేశంలోMLC యల్ రమణ మాట్లాడుతూబి ఆర్ యస్ పార్టీ బి సి ల హక్కుల కోసం మద్దతు ఉంటుందని.. స్వాతంత్ర్యం సమయంలో బి సి ల పాత్ర ఘననియమైనదని,అటువంటి బి సి వర్గాలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని,బలహీన వర్గాల ప్రజలకు కేసీఆర్ న్యాయం చేశారని చెప్పారు. మోడీ , రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టి 42%బి సి రిజర్వేషన్ బిల్ నుఆమోదించాలని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ బి సి లకు బడ్జెట్ లో 10లక్షల కోట్లు పెట్టగా కేవలం 10 వేల కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు.నామినేటెడ్ పదవుల్లో 42%రిజర్వేషన్, కాంట్రాక్టు లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు. బి సి లు కన్నెర్ర చేస్తే కాంగ్రెస్, బిజెపి పార్టీ లు కనుమరుగు అవుతాయని తెలిపారు.అక్టోబర్ 18 బంద్ కు వ్యాపార, వాణిజ్య వర్గాలు సహకరించాలని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News