Friday, March 13, 2026

జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికైన విద్యార్థిని వెన్య జగిత్యాల టౌన్

నేటి సాక్షి(పూరెళ్ల బాపు)….. జగిత్యాల పట్టణంలో నిర్వహించిన మండల స్థాయి కే జి ఎఫ్ క్రీడలలో గౌతమ్ మోడల్ స్కూల్ విద్యార్థిని వెన్య పటేల్ జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికైనట్లు ఎస్ జి ఎఫ్ అధికారి శ్రీనివాస్ గురువారం నాడు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ అరుంధతి మాట్లాడుతూ పిల్లలకు చదువుతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు,ఆటలు లాంటివి తప్పకుండా ఉండాలి విద్యార్థిని విద్యార్థులు మైదానాల్లో ఆడుకున్నప్పుడే వారిలో మానసిక భౌతిక వికాసం జరుగుతుందని అన్నారు అదే ఉద్దేశంతో మా పాఠశాల విద్యార్థిని విద్యార్థులను క్రీడల్లో రాణించే విధంగా ప్రోత్సహిస్తున్నమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రఫీక్,హేమలత, సృజన పలువురు విద్యార్థులను అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News