నేటి సాక్షి, బాపట్ల జిల్లా (కర్లపాలెం)విద్యార్థులు విద్యతో పాటుగా క్రీడల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని బాపట్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసన్న అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ భార్గవి హై స్కూల్ నందు గురువారం ట్రాఫిక్ నిబంధనలపై జరిగిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసన్నకుమారి మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. అదేవిధంగా ప్రతి విద్యార్థి ఉన్నతమైన లక్ష్యంతో విద్యను అభ్యసించాలని కోరారు. నగరం మండలం ఉల్లిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల జరిగిన ఎస్ జి ఎఫ్ డివిజన్ స్థాయి అండర్ -17 బాలికలచెస్ పోటీలలో శ్రీ భార్గవి హై స్కూల్ విద్యార్థిని ఏట్రా అమూల్య అండర్- 14 -విభాగంలో శ్రీ భార్గవి హైస్కూల్ కు చెందిన ఎట్ర దేవి శ్రీ జిల్లాస్థాయి కి ఎంపిక కావడం పట్ల ఆమె విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఎంపికైన విద్యార్థులకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసన్నకుమార్ చేతుల మీదుగా మెడల్స్ ను అందజేశారు. అనంతరం పాఠశాల సిబ్బంది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసన్నకుమారిని దృశ్యాలు వాళ్ళతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ పేరాల వెంకట సురేష్ ప్రిన్సిపాల్ బాపట్ల లక్ష్మి,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు దివ్య, సునీత,సాహితీ, ప్రసన్నకుమారి,సత్యవతి, రిజ్వానా,ప్రేమావతి, చక్రవర్తి శివప్రసాద్ పి ఈ టి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




