నేటి సాక్షి, బాపట్ల జిల్లా ( బాపట్ల టౌన్)బాపట్ల ప్రాజెక్ట్ పడమర బాపట్ల సెక్టార్ స్టువర్టుపురం నందు సిడిపిఓ లక్ష్మీపార్వతి ఆధ్వర్యంలో పోషకాహార మాసోత్సవాలు ఘనంగా జరిగాయి.ఇందులో భాగంగా గురువారం నాడు జంక్ ఫుడ్ పై అవగాహన కలిగించారు. అలాగే గర్భిణీలకు శ్రీమంతాలు ఎంతో వేడుకగా జరిపారు. అనంతరం సిడిపిఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆహారం తీసుకునే ముందు వంట చేసేముందు తప్పక హ్యాండ్ వాష్ చేయాలని లేకపోతే మనకు కనిపించని క్రిముల వలన అనారోగ్యాల బారిన పడతామని సిడిపిఓ వివరించారు.సూపర్వైజర్ పద్మావతి మాట్లాడుతూ పిల్లలకు సరియైన సమతుల్యమైన ఆహారం అందకపోతే వయసుకు తగిన ఎత్తు బరువు ఉండరని కొంతమందిలో ఒబేసిటీ బారిన పడే అవకాశం కూడా ఉన్నదనీ తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాలకి మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లల్ని క్రమం తప్పకుండా పంపించాలని కేంద్రాలలో ఆటపాటలతో విద్య మరియు అన్ని రకాలైనటువంటి అభివృద్ధిలు పిల్లలలో కలుగుతాయనితల్లులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ పద్మావతి అంగన్వాడీ కార్యకర్తలు శేషు కుమారి, ఫాతిమా, సుధా, ఇందిరా, స్వాతి, నాగలక్ష్మి, పద్మావతి, అంగన్వాడి ఆయాలు పెద్ద ఎత్తున లబ్ధిదారులు పాల్గొన్నారు




