నేటి సాక్షి(పూరెళ్ల బాపు)…….స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీలలో జగిత్యాల ఓల్డ్ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న పి శివకుమార్ కబడ్డీలో 9వ తరగతి చదువుతున్న అక్షిత్ బాస్కెట్బాల్ లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు ఈ సందర్భంగా మండల విద్యాధికారి ధరావత్ చంద్రకళ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్, పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు బోయిని పెల్లి ఆనంద్ రావు,ఉపాధ్యాయులు సూర్య ప్రకాష్ శ్రీనివాస్,సురేందర్,మల్లికార్జున్,పద్మ,విద్యాదేవి,సంజీవయ్య ,అరుణ,రజిని,రాజేశ్,చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.




