నేటి సాక్షి తిరుపతి తిరుపతి చిత్తూరు అక్టోబర్ 17 : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పై దాడి చేసిన వ్యక్తిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ( ఎమ్మార్పీఎస్ ) సూరపాకం యువరాజు మాదిగ ఎంఆర్పిఎస్ చిత్తూరు జిల్లా జనరల్ సెక్రెటరీ వెదురుకుప్ప మండల ఇన్చార్జ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వెదురుకుప్ప మండల తాసిల్దార్ ఆఫీస్ ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పలువురు ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు, మాదిగలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యువరాజు ధర్మన్న , ప్రసాద్, ముని, మాట్లాడుతూ ఈనెల 7 వ తేదీన భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఓ కేసుకు సంబంధించి లాయర్ల వాదనలు వింటున్న సమయంలో రాకేష్ కిషోర్ అనే వ్యక్తి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పై తన షూ ను విసిరి దాడికి పాల్పడడం అనాగరికమైన చర్యగా అభివర్ణించారు. న్యాయమూర్తిపై దాడిని ప్రజాస్వామిక స్ఫూర్తి, రాజ్యాంగం మీద జరిగిన దాడిగానే పరిగణించాల్సి వస్తోందన్నారు. సంబంధిత దాడి సమస్త భారతీయులను దిగ్భ్రాంతికి గురి చేసిందని, ముఖ్యంగా దళిత, పీడిత వర్గాల ప్రజలను తీవ్ర మనోవేదనకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమూర్తి గవాయ్ దళితుడు కావడాన్ని కొన్ని ఆధిపత్య శక్తులు జీర్ణించుకోలేక పోవడంతోనే అహంపూరితంగా దాడికి తెగబడ్డాడని మండిపడ్డారు. దాడికి పాల్పడ్డ వ్యక్తితో పాటు, సంబంధిత వ్యక్తి వెనుక ఉన్న శక్తులను గుర్తించి వారికి శిక్షపడేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ప్రజాస్వామిక వాదులుగా గుర్తించబడ్డ సీనియర్ న్యాయమూర్తులతో విచారణ చేయించాలని, అదే క్రమంలో ఇలాంటి సంఘటనలు మరో మారు పునరావృత్తం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టాలని వారు కోరారు. అనంతరం వెదురుకుప్ప మండలం తాసిల్దారు గారు వినతిపత్రం సమర్పించారు. కాగా ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ చిత్తూరు జిల్లా నాయకులు, సీనియర్ నాయకులు ధర్మన్న గారు సీనియర్ నాయకులు మునిగారు సీరియస్ నాయకులు తీపినూరు వాసు గారు, లోకనాథం గారు సర్పంచ్ వెంకట ముని గారు, నూతన నాయకులు తిరుమలయ్య గారు సతీష్ గారు, హరి గారు, సురేష్ మాదిగ, రూపేష్ రూపేష్ మాదిగ, భాను మాదిగ, వాల్మీకి సంఘం రాష్ట్ర కార్యదర్శి మంజునాథ్ గారు, వినాయక మాదిగ, చిరంజీవి మాదిగ,మాదిగ.తదితరులు పాల్గొన్నారు.




