నేటి సాక్షి(పూరెళ్ల బాపు)………………………….,……గోసంతతి పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు జగిత్యాల జిల్లా గో సేవా విభాగం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి గో విజ్ఞాన పరీక్షలను గురువారం పట్టణంలోని వాల్మీకి ఆవాసంలో నిర్వహించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పాఠశాల స్థాయి పోటీల్లో గెలుపొందిన సుమారు 350 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గో సేవా ప్రముఖ బీరెల్లి సంతోష్ మాట్లాడుతూ ప్రాచీన కాలం నుండి భారతీయ ఆర్థిక వ్యవస్థకు గోవు మూల కారణమన్నారు. గోవు ఒక జంతువు కాదని పురాతన కాలం నుండి గోమాతగా అభివర్ణిస్తూ పూజిస్తామన్నారు. గోవులోని విశిష్ట గుణాలను బాల్యం ఉండే విద్యార్థులకు స్థిరపడం కోసం పాఠశాల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్రస్థాయిలో గో విజ్ఞాన పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు.




