నేటి సాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):*గన్నేరువరం మండల కేంద్రము లో మాజీ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ దిష్టి బొమ్మను మండల కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది.ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ గ పై మరియు ఆయన కుటుంబ సభ్యలపై మాజీ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ అభ్యంతరకరమైన, దురుసుగా మాట్లాడిన తీరును సభ్య సమాజం ఖండిస్తుందని. ఇలాంటి మాటలు ఇంకోసారి గనుక మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మెర రవీందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి బొడ్డు సునీల్ చింతల శ్రీధర్ రెడ్డి,కరీంనగర్ కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ అలువాల కోటి, మాతంగి అనిల్,బూర వెంకటేశ్వర్లు బద్దం సంపత్ రెడ్డి బుర్ర తిరుపతి గౌడ్, ముస్కు కర్ణాకర్ రెడ్డి పాకాల పరశురాం, రాపోలు అనిల్ సతీష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




