నేటి సాక్షి,కోరుట్ల టౌన్* (గణేష్ గొల్లపల్లి)కోరుట్ల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో జిల్లా విద్యాధికారి, జగిత్యాల ఆదేశాల మేరకు SNR ఏజెన్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆధార్ క్యాంపును పరిశీలించిన మండల విద్యాధికారి గంగుల నరేశం. ఆయన మాట్లాడుతు మండలంలోని ప్రభుత్వ,ప్రైవేట్ అన్ని పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు ఈ ప్రత్యేక ఆధార్ క్యాంపును సద్వినియోగం చేసుకొని, కొత్త ఆధార్ కార్డులు తీయడం, ఆధార్ కార్డులో పుట్టినతేది, పేరు, అడ్రస్ మార్పులు, చేర్పులు చేయడం, ఆధార్ నెంబర్ కు ఫోన్ నెంబర్ లింక్ చేయడం, కళ్ళు, వేలిముద్రలు మార్చడం మండలంలోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు బయోమెట్రిక్ అప్డేట్ ,ఆధార్ కార్డు లేని విద్యార్థులకు కొత్త ఆధార్ కార్డు తీయుటకు ఇది ఒక మంచి అవకాశం అని,ఈ అవకాశాన్ని విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ ప్రత్యేక క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని, మండల విద్యాధికారి గంగుల నరేశం తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వి.గంగాధర్, ఆపరేటర్ బెక్కం శేఖర్, సి.ఆర్.పి లు పి.గంగాధర్, జ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




