నేటి సాక్షి నారాయణపేట, అక్టోబర్ 17, నారాయణపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 13 నుండి 17 వరకు “సీపీఆర్ అవగాహన వారం”గా నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమం ఉద్దేశ్యం – ప్రతి వ్యక్తికి గుండె ఆగిపోయిన సమయంలో తక్షణ స్పందన ఎలా ఇవ్వాలో తెలియజేయడం, ప్రాణరక్షణ శృంఖలాన్ని ప్రారంభించేందుకు అవసరమైన దశలను నేర్పడం. సీపీఆర్ అనేది అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించే కీలక ప్రక్రియ. గుండె ఆగిపోవడం లేదా శ్వాస ఆడకపోవడం వంటి సందర్భాల్లో సమయానికి సీపీఆర్ అందించడం ద్వారా మనిషి ప్రాణాలను కాపాడుకోవచ్చు అని, ఈరోజు నారాయణపేట జిల్లా 108 అంబులెన్స్ సిబ్బంది ద్వారా ఈరోజు నారాయణపేట లోని ప్రధాన అంబేద్కర్ చౌరస్తా వద్ద మరియు ఆర్టీసీ బస్టాండ్ వద్ద మరియు చిట్టెం నర్సిరెడ్డి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు మరియు ప్రజలకు సిపిఆర్ పై అవగాహన మరియు సలహాలు సూచనలు చేశారు, నారాయణపేట జిల్లా సూపర్వైజర్ రాఘవేంద్ర గారు మరియు108 అంబులెన్స్ సిబ్బంది గుండె నొప్పితో బాధపడి సుహా తప్పిపోయిన వ్యక్తికి సిపిఆర్ ఎలా చేయాలని అనే అంశంపై ప్రజలకు వాళ్లకు క అర్థమయ్యే విధంగా ప్రజలకు వివరించారు అట్లాగే అత్యవసర సమయాల్లో 108 కి కాల్ చేయండి:వెంటనే అత్యవసర వైద్య సేవలకు (108 అంబులెన్స్) కాల్ చేసి సహాయం కోరండి. అంబులెన్స్ సహాయం వచ్చేంతవరకు వెంటనే మీరు వ్యక్తి శ్వాసని పరిశీలించండి:బాధితుడి ఛాతి కదులుతుందా, శ్వాస వినిపిస్తుందా చూడండి. శ్వాస లేకపోతే వెంటనే సీపీఆర్ ప్రారంభించండి.సహాయం వచ్చే వరకు కొనసాగించండి:వైద్య సిబ్బంది వచ్చే వరకు లేదా బాధితుడు కదలడం, శ్వాస తీసుకోవడం ప్రారంభించే వరకు సీపీఆర్ ఆపకండి. ఈ కార్యక్రమంలో జిల్లా సూపర్వైజర్ రాఘవేంద్ర గారు మాట్లాడుతూ “సీపీఆర్ నేర్చుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. ఇది అత్యవసర పరిస్థితుల్లో ఎవరి ప్రాణాన్నైనా రక్షించగలదు.”“ప్రతి ఒక్కరూ సీపీఆర్ నేర్చుకుందాం – ఒక నిమిషం లోపు స్పందిస్తే ఒక ప్రాణం కాపాడవచ్చు!” ఈ కార్యక్రమంలో 108 అంబులెన్స్ సిబ్బంది, టెక్నీషియన్స్ అబ్దుల్ అసాద్, భీమ్ రెడ్డి,వెంకటేష్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




