నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*చిత్తూరు*ఎస్సీ ఎస్టీ సమస్యల పట్ల అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలనీ.., వారికి సంబంధించిన ప్రతి సమస్యకు తక్షణ పరిష్కార మార్గాన్ని చూపాలనీ జిల్లా యంత్రాంగానికి సూచించారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్…..అలసత్వం వహిస్తే ఉపేక్షించేదేలేదని వారు హెచ్చరించారు.చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన డి.వి.యం.సి. సమావేశానికి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ హాజరై.., దళితుల సమస్యలకు సంబంధించిన పలు అంశాలను సుదీర్ఘంగా లోతుగా చర్చించారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ను నిక్కచ్చుగా పాటించాలని ఆదేశించారు.పల్లె ప్రాంతాలలో నివాసముండే ప్రజలు,ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు వివక్షతకు గురవుతూ.. ఇప్పటికీ అంటరాని వారిగా చూడబడుతున్నారనీ.., దళితులకు సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించడంలో కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ…దళిత సంఘాల నేతలు డి.వి.యం.సి.మీటింగ్లో లేవనెత్తిన అంశాలను సావధానంగా విన్న ఎంపీ , జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు.. ఇందుకు సానుకూలంగా స్పందించారు.రాజ్యాంగబద్ధంగా.., ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ.. అస్పృశ్యతకు తావు లేకుండా పాలన చేస్తున్న ఎన్డీఏ సర్కార్ హయాంలో .., ఇలాంటి పోకడలు మంచిది కాదని, మరి ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో వీటిని ఉపేక్షించవద్దని,.. దళితులను అవమాన పరిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవు అనిజిల్లా యంత్రాంగాన్ని హెచ్చరించారు.అదేసమయంలో బాధితులు కూడా సరైన ఆధారాలను సంబంధిత అధికారులకు సమర్పించి న్యాయాన్ని పొందాలని తెలియజేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని ఎస్సీ, ఎస్టీలు చట్టపరంగా.., పోలీసు శాఖ, లేదా.. జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేయడంలో ఎక్కడ వెనకాడ వద్దంటూ హితబోధ చేశారు. ఇక పోతే సిబిల్ స్కోర్ పేరుతో దళితులకు రుణాలను మంజూరు చేయకుండా జాప్యం చేయవద్దని ఎంపీ దగ్గుమళ్ళ , ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ బ్యాంకర్లను కోరారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు రుణాలను మంజూరు చేసి దళితులకు బాసటగా నిలవాలన్నారు. డి.వి.యం.సి. సమావేశంలో ప్రవేశపెట్టిన అజెండా ప్రకారం ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.., ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, చర్చించారు. పెండింగ్లో ఉన్న సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపాలని సంబంధిత అధికారులకు సూచించారు. అంతేకాకుండా జరగబోయే డీ.వి.యం.సి.సమావేశం సమయానికి ఎస్సీ ఎస్టీల సమస్యలకు పరిష్కార మార్గాలని చూపి.., అందుకు సంబంధించిన డేటాను సభ మందు ఉంచేందుకు సన్నద్ధం కావాలని, ప్రతి అంశం పై అవగాహనతో ఉండాలని చెప్పారు.ప్రజా సంక్షేమం కోరి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వూ ప్రవేశపెట్టిన అభివృద్ధి,సంక్షేమ పథకాలను ఎస్సీ ఎస్టీలకు చేరువ చేసి , ఎస్సీ ఎస్టీ సర్వతో ముఖాభివృద్ధికి దోహద పడాలని ప్రభుత్వ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా సంక్షేమ పథకాలను ఎస్సి, ఎస్టిలు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.జిల్లాలో ఎస్సీ కాలనీలకు సంబంధించి, స్మశాన వాటికల అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి 10 లక్షలు,జడ్పీ నిధుల నుంచి 20 లక్షల సహాయాన్ని అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్ మోహన్..,డివిఎంసి సభ్యులు, ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు, సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాలను సందర్శించి.., సమస్యలను గుర్తించినచో తమకు నివేదికలు నాకు అందజేయాలన్నారు.కాణిపాకం ఆలయము నందు శానిటేషన్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది పై పలు ఫిర్యాదులు అందయని, విచారణ అధికారిగా చిత్తూరు ఆర్డీవో రెండు రోజులలో నివేదికలను అందజేస్తారనీ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎంపీ, ఎమ్మెల్యేలకు తెలియజేశారు.త్వరలో గాంధీ సర్కిల్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్ మోహన్ తెలియజేశారు.ఎస్సీ ,ఎస్టీ, అత్యా నిరోధక చట్టం పటిష్టంగా అమలు చేయడం జరుగుతుందనీ చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలమనేర్ ఆర్డీవో భవాని, నగిరి ఆర్డీవో అనుపమ, చిత్తూర్ ఆర్డీవో శ్రీనివాసులు, చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగిరి డిఎస్పీలు అలాగే డివిఎంసి సభ్యులు బి మునీంద్ర నాయక్, వి రాజ్ కుమార్, టి వరలక్ష్మి, జీవి రమణ, సింహం పత్రిక , ఎం శేషాద్రి, కే శంకర్, ఎస్ మునుస్వామి, విజయ భాస్కర్ ,దామోదరం, రఘురాం, ఎస్ రవి, ఏ కుమార్, సారథి, గిరిజన సంక్షేమ అధికారి, మూర్తి, తదితరులు పాల్గొన్నారు,




