నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల్లో నిర్లక్ష్యం ముదురుతోంది. పరీక్షలు చేసిన రెండు వారాలు గడిచినా రోగులకు రిపోర్టులు అందకపోవడంతో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో రక్తం, మూత్ర నమూనాలు ఇచ్చిన రోగులు, ‘ఎప్పుడు రిపోర్టులు వస్తాయో ఎవరికి తెలియదు… సిబ్బంది ఎవరూ సరైన సమాధానం ఇవ్వడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.—*ఆగ్రహానికి దారితీసిన రిపోర్టుల జాప్యం*వైద్య పరీక్షల ఫలితాలు ఆలస్యం కావడంతో చికిత్సలు వాయిదా పడుతున్నాయి. అనేక మంది రోగులు రోజూ ఆసుపత్రికి తిరిగి తిరిగి వస్తున్నా, ‘ఇంకా రిపోర్టులు సిద్ధం కాలేదు’ అనే సమాధానమే అందుతోంది.ఒక రోగి కుటుంబ సభ్యుడు మాట్లాడుతూ, ‘ఇంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంత నిర్లక్ష్యం ఎలా? పరీక్షలు చేయించుకున్నది రెండు వారాలు అవుతోంది. కానీ ఒక్క రిపోర్టు కూడా చేతికి రాలేదు. ఇలా అయితే పేదలకు ఎక్కడ న్యాయం? అని ప్రశ్నించారు.—*టీ–హబ్ ల్యాబ్ సమాధానం – బాధ్యత ఎవరిపై.?*ఇక పరీక్షల బాధ్యత ఉన్న టీ–హబ్ మెడికల్ ల్యాబ్ మాత్రం, ‘మేము నమూనాలను తీసుకున్న వెంటనే పరీక్షించి ఆసుపత్రికి పంపిస్తున్నాం. రిపోర్టుల జాప్యం మాకు సంబంధం లేదు’అని స్పష్టంచేసింది.దీంతో, బాధ్యత ఎవరిదీ అన్న ప్రశ్న ఆసుపత్రి వర్గాల్లో చర్చనీయాంశమైంది.ఆసుపత్రి ఆర్ఎంవో స్పందించకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి మరింత పెరిగింది. రోగుల ప్రాణాలకు సంబంధించిన అంశంలో అధికారులు చూపుతున్న నిర్లక్ష్యం పట్ల స్థానికులు మండిపడుతున్నారు.—*ప్రజల ఆరోగ్యం పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకు?*’ప్రభుత్వ ఆసుపత్రి అంటే ప్రజల ప్రాణ భద్రతకు అడ్డుకట్టగా ఉండాలి కానీ, ఇప్పుడు అవే నిర్లక్ష్యానికి కేంద్రాలుగా మారుతున్నాయి. రోగుల బాధలు ఎవరు వినాలి?’ అని..ఆసుపత్రి యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకుని బాధ్యత వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ప్రజా ఆసుపత్రులు ప్రజల ప్రాణ రక్షణకు కేంద్రమవ్వాలి కానీ..నిర్లక్ష్యం నాశనానికి దారి తీస్తుంది.!____




