Friday, March 13, 2026

18న బీసీ సంఘాల బంద్‌కు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు. మండల పార్టీ అధ్యక్షులు బానోతు సారంగపాణి

నెట్ సాక్షి, నల్లబెల్లి ప్రతినిధి అక్టోబర్ 17 : బీసీ సంఘాల బందుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు.నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు, శనివారం (18న) జరగనున్న బీసీ బంద్‌కు నల్లబెల్లి మండల భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ పూర్తి మద్దతు ప్రకటించినట్లు మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి తెలిపారు.ఈ సందర్భంగా సారంగపాణి మాట్లాడుతూ రాజకీయ, విద్యా, ఉద్యోగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌తో తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాలు పాటిస్తున్న బంద్‌కు మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామ‌ని హామీ ఇచ్చినా, అమలు చేయడంలో విఫలమైంది. శాస్త్రీయ విధానాలు పాటించకుండా జారీ చేసిన ఆర్డినెన్సులు, జీవోలు, బిల్లులు కోర్టుల్లో నిలబెట్టుకోలేకపోయాయి. దీంతో బీసీలకు ప్రత్యక్షంగా అన్యాయం జరుగుతోంది. కేంద్రం, రాష్ట్రంలో ఉన్న రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ బీసీలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నాయి.బీసీలకు రాజ్యాంగబద్ధంగా రాజకీయ, విద్య, ఉద్యోగాలలో 42% రిజర్వేషన్లు కల్పించేవిధంగా పార్లమెంట్‌లో చట్టాలు చేయాలి. తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చి చట్టబద్ధత ఇవ్వాలని.సారంగపాణి తెలిపారు, బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిసిన బీసీ సంఘాల ప్రతినిధులు మద్దతు కోరిన నేపథ్యంలో రాష్ట్ర పార్టీ ఇప్పటికే ఆమోదం తెలిపింది. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నల్లబెల్లి మండలంలోని అందరూ బీఆర్ఎస్ శ్రేణులు రేపు జరిగే బంద్‌లో బీసీలకు అండగా నిలవాలని బానోతు సారంగపాణి పిలుపునిచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News