Friday, March 13, 2026

ఫామ్ హౌస్‌పై దాడి చేసిన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్- బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు – బెజ్జంకి పోలీసులకు లేఖ

నేటి సాక్షి, బెజ్జంకి:బెజ్జంకి మండలం గుండారం గ్రామంలోని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఫామ్ హౌస్‌పై శుక్రవారం కాంగ్రెస్ నేతలు దాడి చేసి ధ్వంసం చేసిన ఘటనపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెజ్జంకి మార్కెట్ యార్డ్ వద్ద ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.ఈ సందర్భంగా వారు బెజ్జంకి పోలీస్ స్టేషన్‌లో సీఐ శ్రీనివాస్,ఎస్సై సౌజన్యలకు పిర్యాదు ఇచ్చారు.బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, ఫామ్ హౌస్‌పై దాడి చేసిన కాంగ్రెస్ నేతలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా దరఖాస్తు ఇచ్చిన వారిలో అమిత్,లింగాల లక్ష్మణ్,కనగండ్ల తిరుపతి,ఏఎంసీ మాజీ చైర్మన్ కచ్చు రాజయ్య,హన్మండ్ల లక్ష్మారెడ్డి,ఎల శేఖర్ బాబు,ఎలుక దేవయ్య, దీటి రాజు,వంగల నరేష్, బిగుళ్ళ మోహన్,రామలింగారెడ్డి,గణపురం తిరుపతి ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News