Friday, March 13, 2026

స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణం కోసం వివిరివిగా మొక్కలు నాటుదాం వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించి ప్రతిఒక్కరు మొక్కలను పెంచాలి : స్వచ్ఛ దీపావళి గ్రీన్ దీపావళి మనమందరం కాలుష్యం లేకుండా పర్యావరణాన్ని కాపాడాలి: జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్.

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) తిరుపతి , అక్టోబర్ 18: స్వర్ణ ఆంద్ర స్వచ్ఛ ఆంధ్ర లో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య మరియు ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణం కోసం ప్రతి ఒక్కరు వివిరివిగా మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం స్వర్ణ ఆంద్ర స్వచ్ఛ ఆంధ్ర పై అందరిచేత ప్రతిజ్ఞ జిల్లా కలెక్టర్ చేపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల కార్యక్రమం “ స్వచ్ఛమైన గాలి – కాలుష్య రహిత నగరం“ అనే థీమ్‌తో ప్రారంభమవుతుందన్నారు . ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణ ఆంద్ర స్వచ్ఛ ఆంధ్ర లో భాగంగా నేడు తిరుపతి నగరపాలక సంస్థ అధ్వర్యంలో నెహ్రు మునిసిపల్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన “స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో నందు పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం ను నిర్వహించి స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యమైన జీవనం కొరకు శుభ్రమైన గాలిని ఉపయోగించండం కోసం మరిన్ని చెట్లను పెంచాలని అప్పుడే స్వర్ణ ఆంద్ర స్వచ్ఛ ఆంధ్ర దిశగా ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంటుందని తెలిపారు. వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించి ప్రతిఒక్కరు మొక్కలను పెంచె విదానాన్ని అవలంభించుకోవాలని తెలిపారు. దీపావళి సమీపిస్తున్నందున టపాసుల వల్ల కలిగే గాలి కాలుష్యాన్ని తగ్గించడమే ఈ నెల ప్రధాన లక్ష్యం అన్నారు. ప్రతి వార్డులో క్రాకర్ పొల్యూషన్ తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలనన్నారు. స్వచ్ఛ దీపావళి గ్రీన్ దీపావళి అని ఈ దీపావళికి మనమందరం పర్యావరణ అనుకూలమైన దీపాలు మరియు కొవ్వొత్తులను ఉపయోగించుకోవాలని, కాలుష్య నివారణ దిశగా ప్రజలు ముందుకు వెళ్ళాలని తెలిపారు. ప్రతి ఒక్కరు దగ్గరగా ప్రదేశాలకు వాహనముల ద్వార కాకుండా నడక ద్వార వెళ్ళుట వలన కాలుష్యాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చాన్నారు. స్థానిక తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ “స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో పరిశుభ్రత పాటించడం అత్యంత అవసరమైందని ప్రతి నెల మూడవ శనివారం పర్యావరణహిత కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతున్నాయన్నారు. గత ఆరు నెలలుగా ప్రజల, ఉపాధ్యాయుల, అధికారులు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి,” అని తెలిపారు.“గత నెలలో పార్కు ప్రాంతాల్లో శుభ్రత కార్యక్రమాలు, మొక్కల నాటడం వంటి చర్యల ద్వారా పరిశుభ్రమైన గాలి వాతావరణం సృష్టించడమే మా లక్ష్యం. ఈ నెల కార్యక్రమం ‘క్లీన్ ఎయిర్– పొల్యూషన్ క్లీన్ సిటీ’ అనే థీమ్‌తో ప్రారంభమవుతోంది. గాలి కాలుష్యం తగ్గించడానికి ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను తీసుకోవాలని సూచించారు.“మంచి గాలి ఉన్నచోటే ఆరోగ్యం ఉంటుంది. నేడు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించాలంటే మనందరం చెట్లు నాటాలని ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా మలచాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాలను ప్రతీ నెల మూడవ శనివారం నిర్వహిస్తున్నారన్నారు. “ఈరోజు మున్సిపల్ పరిధిలో ఎన్డీఏ కూటమి నాయకులు, మున్సిపల్ కమిషనర్ గారు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ సత్కార్యానికి శ్రీకారం చుట్టారని, ప్రజల భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎన్. మౌర్య మాట్లాడుతూ స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద ప్రతి నెల మూడవ శనివారంనాడు ఒక థీమ్ ఆధారిత అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతోందని. ఈ నెలలో ‘ క్లీన్ –ఎయిర్ పొల్యూషన్ ఫ్రీ సిటీ ’ అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరుగుతోందని తెలిపారు.“దీపావళి సమీపిస్తున్నందున టపాసుల వల్ల కలిగే గాలి కాలుష్యాన్ని తగ్గించడమే ఈ నెల ప్రధాన లక్ష్యం. ప్రతి వార్డులో క్రాకర్ పొల్యూషన్ తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, నడక, సైకిల్ వంటి పర్యావరణహిత మార్గాలను ఉపయోగించాలని , చిన్న దూరాలకు కార్ లేదా బైక్ వాడకుండా నడిచి వెళ్లడం అలవాటు చేసుకోవడం ద్వారా కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు,” అని పేర్కొన్నారు. “పర్యావరణ పరిరక్షణలో భాగంగా నగరంలోని కొత్త భవనాల అనుమతులలో రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు తప్పనిసరి చేశారు. సోలార్ వినియోగం పెరగడం వల్ల విద్యుత్ వినియోగం తగ్గి, శక్తి సంరక్షణ సాధ్యమవుతుందన్నారు.అనంతరం నెహ్రు మైదానంలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాలను పరిశిలించి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య మరియు ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశిలించి దుకాణా దారులకు జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణ, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్. సి. మునికృష్ణ, కార్పొరేటర్ నారాయణ, గంగమ్మ గుడి చైర్మన్ మహేష్, ఎస్సీ కార్పొరేషన్ మెంబెర్ కుమారమ్మ, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News