Friday, March 13, 2026

ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రజల సమస్యలపై దృష్టి సారించిన జువ్వాడి నర్సింగరావు కోరుట్ల ప్రజల సమస్యలపై చర్చ పరిష్కారానికి కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ హామీ

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు శనివారం రోజున పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్‌లో కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యలు, రహదారుల దుస్థితి, పెండింగ్ సబ్సిడీ బిల్లులు, గృహ నిర్మాణ పథకాల జాప్యం వంటి అంశాలపై నాయకులు చర్చించారు.*ప్రజా సమస్యల పరిష్కారమే ప్రాధాన్యం*ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ..’ప్రజలు తమ సమస్యలను ఏ రాజకీయ భయమూ లేకుండా నేరుగా నాకు తెలియజేయాలి. వాటి పరిష్కారానికి నేను అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాను. ప్రజల సమస్యలే నాకు ముఖ్యమైనవి. నేను ఎప్పటికప్పుడు మీ పక్కనే ఉంటాను” అని హామీ ఇచ్చారు. ఆయన తెలిపారు.’పేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సక్రమంగా అందడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని త్వరగా పరిష్కరించేందుకు జిల్లా స్థాయి అధికారులతో చర్చిస్తాన’న్నారు.—*ప్రజల సంక్షేమం పట్ల కాంగ్రెస్ కట్టుబడి ఉంది*’ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తోంది. ఇంద్రమ్మ ఇల్లు, రైతు రుణమాఫీ, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, యువతకు ఉపాధి అవకాశాలు వంటి పథకాలు ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడమే లక్ష్యంగా ఉన్నాయ’న్నారు. ఈ పథకాలను ప్రతి అర్హుడూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ప్రజల మధ్యకు చేరి సమస్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కారం కోసం కృషి చేయడం తమ పార్టీ విధానం అని జువ్వాడి నర్సింగరావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజామిత్ర చర్యలు గ్రామస్థాయిలో ప్రతిఫలించేలా ప్రతి కార్యకర్త ప్రజలతో సమన్వయం కలిగి ఉండాలని సూచించారు.ఈయన వెంట నాయకులు అన్నం అనిల్,రాజేందర్ తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News