Friday, March 13, 2026

*42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు కేంద్రం బాధ్యత!** జగిత్యాల జిల్లాలో ‘బిసి బంద్ విజయవంతం * సమాజం మొత్తం సంఘీభావం తెలిపింది : జీవన్ రెడ్డి___*

నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడం ఇప్పుడు దేశంలోని సామాజిక న్యాయానికి పరీక్షగా మారిందన్నారు.దీనికి చట్టబద్ధత ఇవ్వడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.—*బంద్ విజయవంతం -సంఘీభావం తెలిపిన సమాజం*బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు జరిగిన బంద్ విజయవంతంగా ముగిసిందని ఆయన తెలిపారు.’ఈ బంద్ తెలంగాణ సాధన ఉద్యమంలో సకల జనుల సమ్మెను తలపించిందన్నారు. రిజర్వేషన్ అమలుపై ప్రజల్లో ఉన్న అవగాహన, చైతన్యం స్పష్టమైందని తెలిపారు. వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు, అన్ని వర్గాలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనడం బీసీల హక్కుల పట్ల ఉన్న సంఘీభావానికి నిదర్శనమని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.—*చట్టబద్ధత కోసం 9వ షెడ్యూల్ చేర్చాలని డిమాండ్*రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే విధంగా శాసన సభ, మండలిలో తీర్మానాలు ఆమోదించిందని తెలిపారు.’ఈ రిజర్వేషన్‌కి చట్టబద్ధత రావాలంటే కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్‌లో చేర్చాలన్నారు. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వమో, ఒక పార్టీదో సమస్య కాదు. సామాజిక న్యాయం కోసం దేశవ్యాప్త పోరాటం కావాల’ని పేర్కొన్నారు.గత ప్రభుత్వ కాలంలో స్థానిక సంస్థల్లో 50 శాతం పరిమితిని మించేలా చట్టం సవరణకు ప్రయత్నించినట్లు తెలిపారు. ప్రస్తుతం గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్‌లో ఉందని వివరించారు.*సామాజిక న్యాయం సాధనకు రాజకీయాలకు అతీత ఐక్యత*బంద్ విజయవంతానికి రాజకీయ పార్టీల ఐక్యత ప్రధాన కారణమని జీవన్ రెడ్డి అన్నారు.’బీసీల హక్కుల కోసం ఆర్. కృష్ణయ్య చొరవ తీసుకుని బీసీ ఐక్య వేదిక ద్వారా పిలుపునివ్వడం గొప్ప విషయం. కాంగ్రెస్ సహా అన్ని పార్టీల నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఇది రాజకీయాలకు అతీతమైన సామాజిక న్యాయ ఉద్యమ’ని పేర్కొన్నారు.జస్టిస్ ఈశ్వరయ్య, జస్టిస్ చంద్రకుమార్, చిరంజీవి వంటి న్యాయ నిపుణుల సలహాల మేరకు రిజర్వేషన్ చట్టబద్ధత దిశగా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.*కేంద్రం రాజకీయ కోణంలో చూడవద్దు*’రిజర్వేషన్ సమస్యను రాజకీయంగా చూడకూడన్నారు. ఇది దేశంలోని వెనుకబడిన వర్గాల భవిష్యత్తును నిర్ణయించే అంశం. కేంద్రం సానుకూలంగా స్పందించి, 9వ షెడ్యూల్‌లో చేర్చి చట్టబద్ధత ఇవ్వాల’ని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.బలహీన వర్గాలు సామాజికంగా, ఉపాధి, రాజకీయంగా వెనుకబడి ఉన్నాయని డెడికేటెడ్ కమిషన్ నిర్ధారించిందని గుర్తు చేశారు.’సామాజిక న్యాయం అంటే కేవలం నినాదం కాదు — అది దేశ ఆత్మ’ అని తాటిపర్తి జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News