నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి అక్టోబర్ 18అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో చౌడేపల్లి మండలానికి చెందిన విద్యార్థి ప్రతిభను కనబరిచాడు మండలంలోని ఆమెనుగొండ పంచాయతీ సింగరి గుంటకు చెందిన బాల కుమార్ కుమారుడు శివశంకర వరప్రసాద్ సదువు వద్ద గల గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు ఈ క్రమంలో అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో వ్యాసర చిన్న పోటీలు నిర్వహించారు అందులో పాల్గొన్న శివశంకర వరప్రసాద్ మొదటి స్థానంలో నిలచాడు దీంతో ఉపాధ్యాయులు అతనికి ప్రోత్సాహక బహుమతి ప్రశంసా పత్రాన్ని అందించి ఆశీర్వదించారు చిన్నతనం నుంచి ప్రతి పాఠశాలోనూ విద్య తో పాటు పలు అంశాలలో ప్రతిభను కనపరుస్తున్న విద్యార్థిని పలువురు అభినందించారు




