నేటి సాక్షి, బాపట్ల జిల్లా (కర్లపాలెం)ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమే స్వచ్ఛ ఆంధ్ర పై ప్రత్యేకమైన దృష్టి పెట్టి, అధికార యంత్రాంగాన్ని సైతం అప్రమత్తం చేసి విస్తృత స్థాయిలో ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు వాడవాడలా చేపట్టడం అభినందనీయం అని ఎంపీటీసీ సభ్యులు మరియు మాజీ సైనికుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు.కర్లపాలెం మండలం కొత్త నందాయ పాలెం లో సర్పంచ్ శ్రీమతి ఆట్ల వెంకటేశ్వరమ్మ అయ్యప్ప రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని, కొత్త నందాయ పాలెం గ్రామాన్ని వాయు కాలుష్య రహిత గ్రామంగా ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించి, మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. బాపట్ల శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు మరియు జిల్లా కలెక్టర్ శ్రీ వినోద్ కుమార్ ల ఆదేశాలను క్రమశిక్షణతో పాటిస్తూ, ప్రతి నెలలో మూడవ శనివారం రోజున గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి మురళి రెడ్డి తో పాటు సచివాలయం సిబ్బందిని ఎంపీటీసీ సభ్యులు తాండ్ర ప్రశంసించారు.కార్యక్రమంలో సర్పంచ్ శ్రీమతి ఆట్ల వెంకటేశ్వరమ్మ అయ్యప్ప రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మురళి రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ సాయి వర్ధన్ రెడ్డి, సచివాలయం సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.




