నేటిసాక్షి, మిర్యాలగూడ : స్థానిక సంస్థల ఎన్నికలలో విద్య మరియు ఉద్యోగాలలో బీసీలకు 42% రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంటే అడ్డుకున్నటువంటి అగ్రవర్ణాలకు మరియు న్యాయ వ్యవస్థ కూడా బీసీల పట్ల వ్యతిరేక తీర్పులను ప్రదర్శిస్తున్నందుకు నిరసనగా శనివారం బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య ఇచ్చిన పిలుపుమేరకు, తెలంగాణ రాష్ట్ర బీసీ బంద్ లో భాగంగా నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండల కేంద్రంలో బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్య యాదవ్ అధ్యక్షతన దామరచర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, బీసీ సంఘాలు, సేవాలాల్ సేన, ఎమ్మార్పీఎస్, మాల మహానాడు మరియు కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్, సిపిఎం, సిపిఐ, టిడిపి, బిజెపి, డీఎస్పీ పార్టీ లు అఖిలపక్షాల ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చి తెల్లవారుజాము నుండి విద్యాసంస్థలను, వ్యాపార వాణిజ్య సముదాయాల షాపులను, హోటలను, ప్రభుత్వ కార్యాలయాలైన బ్యాంకులు, తహశీల్దార్ కార్యాలయం ప్రశాంతంగా బంద్ చేయించి, దామరచర్ల మండల కేంద్రంలోని నార్కెట్ పల్లి- అద్దంకి హైవేపై అన్ని అఖిల పక్షాల ఆధ్వర్యంలో సుమారు గంటపాటు రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బీసీ బిల్లును తప్పనిసరిగ్గా గవర్నర్, కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. ఈ బంద్ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గాజుల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కొర్ర నాగు నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కందుల నరసింహారెడ్డి, మాజీ ఎంపీపీ ధీరావత్ నందిని రవితేజ, దామరచర్ల మాజీ సర్పంచ్ బంటు కిరణ్, సిపిఐ మండల కార్యదర్శి పోలేపల్లి ఉదయ్, సిపిఎం మండల పార్టీ అధ్యక్షులు మాలోత్ వినోద్, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కొండారపు నాగేశ్వరరావు, బిజెపి పార్టీ మండల నాయకులు బయ్యా అరవింద్, డీఎస్పీ పార్టీ అధ్యక్షులు గద్దల సైదులు, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా, ధీరావత్ మానియా నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కొండా లక్ష్మణ్ గౌడ్ ,దామరచర్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గాలం వెంకన్న, సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి ధీరావత్ మోహన్ నాయక్, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సందాల శంబయ్య మాదిగ, మాల మహానాడు మండల అధ్యక్షులు బైరం గురవయ్య, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా నాయకులు కొమ్ముదాసు, ఆకారపు గోపాలు, సిపిఎం పార్టీ మహిళా మండలి అధ్యక్షురాలు శాంతి, సిఐటియు జిల్లా నాయకులు బైరం దయానంద్,దామచర్ల మండల కాంగ్రెస్ నాయకులు ధీరావత్ నెహ్రూ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్కే ఘని, యూత్ కాంగ్రెస్ నాయకులు సిద్దు నాయక్, బీసీ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుండిగాల వెంకటేశ్వర్లు గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు గాలం వేణు, సందాల క్రాంతి, మేడ సందీప్, తెలంగాణ ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బల్గూరి పౌల్,ఎమ్మార్పీఎస్ మండల నాయకులు గద్దల సత్యం, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ధీరావత్ లింగ నాయక్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జిల్లా కో- కన్వీనర్ ఎండి సద్దాం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ రూపవత్ శివ చరణ్, టీవీ గూడెం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బత్తిని వెంకటేశ్వర్లు గౌడ్, కాంగ్రెస్ నాయకులు కుర్ర నాగరాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు గొడ్డేటి మధు,బీసీ యువజన సంఘం దామరచర్ల మండలం అధ్యక్షులు ఎర్ర మాద కుమార్, బీసీ సంఘం నాయకులు అతిథి వెంకన్న గౌడ్, దంతా గాని కృష్ణ గౌడ్, సాయం నాగరాజు, ధనాల నాగరాజు, కాతోజు సోమయ్య ఇంకా అనేకమంది అఖిలపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు, కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




