Friday, March 13, 2026

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బి.సి రాష్ట్ర బందుకు సంపూర్ణ మద్దతు – నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి కుత్బుల్లాపూర్ అక్టోబర్ 18

(నేటి సాక్షి) టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో డివిజన్లలో , నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీల నందు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర బీసీ బందు కార్యక్రమంలో పాల్గొన్నా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీలకు న్యాయం చేయాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు అక్టోబర్ 18న బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుంది. బీసీల పట్ల నిజమైన చిత్త శుద్ధి ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ.తెలంగాణలో బీసీలు విద్య,ఉద్యోగ ,ఉపాధి మరియు రాజకీయాలలో (స్థానిక సంస్థల ఎన్నికల్లో) బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే కృతనిశ్చయంతో , దృఢ సంకల్పంతో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే దిశగా ప్రయత్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ.అసెంబ్లీలో బీసీ బిల్లు మరియు ఆర్డినెన్స్ ను ప్రవేశపెడితే బీజేపీ ,భారస పార్టీలు మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి కోర్టులో నాటకమాడి స్థానిక ఎన్నికల్లో బిసిలకు రిజర్వేషన్ రాకుండ అడ్డుకుని,బీసీలను మోసం చేసిన బీసీ ద్రోహులు ఈ బీజేపీ,భారస పార్టీలు.రాష్ట్రంలో బీజేపీకి 8 ఎంపీలు (ఇద్దరు కేంద్ర మంత్రులతో )సహా ఉండి ఏంటి ఉపయోగం. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర బీజేపీ సర్కార్ మెడలు వంచి బీసీ బిల్లును ఆమోదింపజేసి చట్టం ద్వారా 9 వ షెడ్యూల్లో చేర్చడానికి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తే సహకరించాల్సిన బీజేపీ,భారస పార్టీలు మొహం చాటేశాయి.బీజేపీ,భారస పార్టీలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ బీసీలకు ద్రోహం చేస్తున్నాయి.తెలంగాణాలో పూర్తి స్థాయిలో సమగ్ర కులగణన చేసి బీసీలకు న్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ.బీసీ ప్రధాని, బీసీ ఉపరాష్ట్రపతి,బీసీ కేంద్ర మంత్రులు ఉన్నారు అని గొప్పలు చెప్పుకునే కేంద్ర బీజేపీ పార్టీ,నిజంగా బీసీలపట్ల చిత్త శుద్ధి ఉంటే బీసీల సంక్షేమం కోసం దేశ వ్యాప్తంగా కులగణన చేసి బీసీలకు న్యాయం చేకూర్చే దిశగా పనిచేయాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిసి ముఖ్య నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News