Friday, March 13, 2026

బీసీలకు మద్దతు ప్రకటించిన మంత్రి అడ్లూరి.

నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో గొల్లపల్లి మండల కేంద్రంలో బీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని బీసీ సంఘాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన విధంగా రాష్ట్రంలో కులగణన నిర్వహించి బీసీల జనాభా ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి అసెంబ్లీలో బిల్లు చేసిందని, కానీ కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును చట్టంగా మారకుండా అడ్డుకుంటుందని అన్నారు. దీంతో స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకురాగా కొంతమంది కుట్రల ద్వారా హైకోర్టు స్టే విధించిందని గుర్తు చేశారు. ఏది ఏమైనా తమ ప్రభుత్వం బీసీ వర్గాల హక్కుల కోసం కట్టుబడి పనిచేస్తుందని, 42 శాతం రిజర్వేషన్ సాధన దిశగా కృషి చేస్తోందని అన్నారు ఈ కార్యక్రమం లో బీసీ సంఘలు ప్రజ సంఘలు రాజకీయ నాయకులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News