నేటి సాక్షి, ధర్మారం (అక్టోబర్ 18) : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆప్ ధర్మారం ఆధ్వర్యంలో ఆదివారం రోజున బస్టాండ్ ప్రయాణ ప్రాంగణంలో ఉచిత షుగర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. సుమారు 60 మందికి షుగర్ పరీక్షలు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు లయన్ ఇప్ప మల్లేష్. ఉపాధ్యక్షులు లయన్ నాడెం శ్రీనివాస్, లయన్ కడారి కుమార్ తదితరులు పాల్గొన్నారు.





