Friday, March 13, 2026

*ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం* *20 సంవత్సరాల తర్వాత అపూర్వ కలయిక*

నేటి సాక్షి పాలేరు, అక్టోబర్ 19:మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000 నుండి 2005 వ సంవత్సరంలో 10 వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులు స్థానిక పాఠశాలలో ఆదివారం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత వారితో పాటు చదువుకొని మృతి చెందిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సంతాప సూచకంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. 20 సంవత్సరాల తర్వాత కలవడంతో చిన్ననాటి జ్ఞాపకాలను వేసుకున్నారు. వివిధ రంగాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర రంగాల్లో స్థిరపడిన అలనాటి విద్యార్థులు ఒకచోట చేరి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఆనందంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని ఆటపాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆనందంగా గడిపారు. అనంతరం తమకు విద్య నేర్పిన గురువులకు శాలువాలతో సన్మానించి మెమొంటో అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తాజా పరిస్థితులను, కుటుంబ వివరాలను సభా వేదికగా పంచుకున్నారు. అనంతరం విద్యార్థులను క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి ఉపాధ్యాయులు పాఠాలు చెప్పి గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులు సహం పక్తి బోజనాలు చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామానుజాచార్యులు, ఆశ, సత్తార్ బేగం, రవి, సురేందర్ రెడ్డి, నరసింహారావు, స్కూల్ అటెండర్ రమేష్, విద్యార్థులు బానోతు కృష్ణ, దామల రాజు, అర్వపల్లి నరేష్, నాగేశ్వరరావు, పడిశాల వినయ్, దామల్ల నరేష్, సతీష్, స్వామి, పిడియాల రామ్, లక్ష్మణ్ స్వరూప, సునీత, రజిని, రేణుకా, స్రవంతి, ధనలక్ష్మి, ఉమ, భవాని, అనూష, శారద, కీర్తి, ప్రత్యూష, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News