*నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )ఇటీవల గుండె పోటుతో మృతి చెందిన మెకానిక్ సిరికొండ బాలరాజు కుటుంబానికి కోరుట్ల మెకానిక్ సంఘం, తెలంగాణ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ సొసైటీ పక్షాన డెభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.ఈసందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఆల్ టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు తొడేటి బాబు మాట్లాడుతూ మెకానిక్ ల కష్టాలు నిరంతరం ఆయిల్ గ్రీస్ పెట్రోల్ పొగ వలన అనారోగ్యం పాలై అనేక మంది మెకానిక్ లు అర్థాంతరంగా చనిపోతున్నారని వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.తమ వెల్ఫేర్ సొసైటీ నుండి ఎంత చేసిన తక్కువే అని అందరం కలిసి డెభై వేల రూపాయలు బాలరాజు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం మెకానిక్ లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమ సమస్యలు పరిష్కరించాలని, చనిపోయిన మెకానిక్ కుటుంబానికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, పిల్లల చదువులు లకు ప్రభుత్వం తోడ్పాటు అందించాలని బాబు కోరారు.ఈకార్యక్రమంలో తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్, మెకానిక్స్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాసం రాంప్రసాద్, కోరుట్ల గౌరవ అధ్యక్షుడు అడేపు శంకర్,పొలాస నరేష్, రాష్ట్ర కార్యదర్శి ఎం డి ముజమ్మిల్, సాబిర్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కటుకం గోవర్థన్, అల్లే రమేష్,వడ్లకొండ రమేష్,మండలోజి అంజయ్య, ఆర్మూర్ రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.





