నేటి సాక్షి, బెజ్జంకి:బెజ్జంకి మండలంలోని సత్యార్జున ఫంక్షన్ హాల్ లో ఆదివారం జరిగిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆటో యూనియన్ ఎన్నికల్లో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో బొనగం శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షుడిగా, గూడ పరుశరాములు ఉపాధ్యక్షుడిగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు కొత్త కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. మొత్తం 150 మంది ఆటో యూనియన్ సభ్యులు ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త కమిటీ యూనియన్ అభివృద్ధి కోసం కృషి చేస్తామని సభ్యులు తెలిపారు.





