నేటి సాక్షి, బెజ్జంకి: బెజ్జంకి గ్రామానికి చెందిన బోనగిరి పోషవ్వ అనే పారిశుద్య కార్మికురాలు మేజర్ గ్రామపంచాయతీ అయినా బెజ్జంకిలో గత 15 సంవత్సరాలనుండి గ్రామ పంచాయతీ సపాయి కార్మికురాలుగా విధులు నిర్వహిస్తుంది.బోనగిరి పోషవ్వ తన అవసరాల నిమిత్తం బెజ్జంకి నుండి వెరే గ్రామానికి వెళ్ళేటప్పుడు బెజ్జంకి క్రాసింగ్ వద్ద ఆక్సిడెంట్ కు గురి కావడం జరిగింది. ప్రస్తుతం ఆమె హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా,శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గల్ఫ్ కార్మికుల సేవ సమితి వ్యవస్థాపకులు వేముల శంకర్ సభ్యులు దృష్టి కి తీసుకు రాగా గల్ఫ్ సేవ సమితి సభ్యులు అందరి సహకారంతో 9000 రూపాయలు అందించారు.ఈ కార్యక్రమంలో గల్ఫ్ సేవ సమితి అధ్యక్షలు గుంటి శ్రీను,గౌరవ అధ్యక్షులు రాంపూరి రాజశేఖర్,ఉపాధ్యక్షులు ఉత్కం రమేష్,సోషల్ మీడియా అబ్దుల్ కలాం,సీనియర్ నాయకులు ఉత్కం తిరుపతి,గైని సురేష్, మారుపాక ఎల్లయ్య,బిగుల్ల నాగార్జున,జుట్టు రమేష్, అనుశ్రీ,అయూబ్, శివ, రాజకుమార్,బంగారు రాజు, వేముల చరణ్ పాల్గొన్నారు.





