నేటి సాక్షి, నారాయణపేట, అక్టోబర్ 20,నారాయణ పేట్ నియోజకవర్గ ప్రజలందరికీ శాసన సభ్యురాలు చిట్టెం పర్ణిక రెడ్డి గారు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి గారు ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా.. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి ప్రతి ఇంటా ఆనందాలను, సిరులను కురిపించాలని ఎంపీ ఆకాంక్షించారు. ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఆహ్వానించే దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవి మీ ఇంటిల్లిపాదినీ సకల శుభాలతో అనుగ్రహించాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బాణా సంచా కాల్చే సమయంలో ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి గారు ఆకాంక్షించారు..





