నేటి సాక్షి, కోటపల్లి:చెన్నూరు నియోజక వర్గంలో నీ కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. రొయ్యలపల్లి గ్రామానికి చెందిన దాగామ శ్రీశైలం సోమవారం పండగ పూట గ్రామంలో రామాయణం నాటకం ఆడటానికి ప్రాణహిత స్నానం ఆచరించడానికి ఆలుగామ గ్రామం దగ్గర ప్రాణహిత నదిలో స్నానానికి వెళ్లి స్నానం చేస్తుండగా లోతు అంచనా తెలియక ప్రాణహిత నదిలో గల్లంతయ్యాడు.అల్లుగామ గ్రామంలో విషాదం నెలకొంది.ఈతగాళ్లు,అగ్నిమాపక సిబ్బంది మరియు స్థానిక కాంగ్రెస్ నాయకుడు గట్టు లక్ష్మణ్ గౌడ్ జేక శేఖర్,తిరుపతి.కోటపల్లి ఎస్సై రాజేందర్ సంఘటన స్థలం దగ్గర ఉండి గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.





