నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)——-చిత్తూరు -21-10-25——–21వ శతాబ్దపు అదృశ్య నాడి గూగుల్ అన్నారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.భారతదేశ తూర్పు డిజిటల్ విప్లవానికి విశాఖపట్నం నాయకత్వం వహించనుందని తెలిపారు. గూగుల్ రాకతో ఆంధ్రప్రదేశ్ భవిత మారనుందని ఆయన ఉద్ఘాటించారు చేశారు.గ్రీన్ డిజిటల్ పవర్ కి ఏపీ నమూనా రాష్ట్రంగా ఆవిర్భవించగలదని అభిప్రాయపడ్డారు.గూగుల్ రాకతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు క్యూ కడుతున్న నేపథ్యంలో దీపావళి పర్వదినాన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు స్పందించారు.ఇంత గొప్ప ప్రాజెక్ట్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి కృషితోనే సాధ్యమైందని ఆయన మంగళవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.దీనికి కారణమైన దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబులకు ధన్యవాదాలు తెలపడంతో పాటు దీపావళి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ప్రపంచానికి భారతదేశం ఓ గుండె లాగా గూగుల్ సేవలు అందించస్తూ..,దేశ తూర్పు సముద్ర తీరాన్ని పునర్నిర్వచించగల ఇంజన్ లా పనిచేస్తుందన్నారు.డిజిటల్ యుగం రిఫైనరీగా విశాఖ పట్నం మారడానికి సిద్ధంగా ఉందన్నారు. ఒక గిగావాట్ సెంటర్ అనేది పవర్ ప్లాంట్ కి సమానమైన సాంకేతికతో కూడిన 21వ శతాబ్దపు అదృశ్య జీవనాడిగా వినియోగింపబడుతుందని చెప్పారు. కేవలం నిర్మాణంలోనే దాదాపు 1,700 మంది కార్మికులు పని చేస్తారనీ.., స్థానిక యువతకు స్థిరమైన జీవనోపాధిని, శిక్షణను అందిచి, నిరుద్యోగ యువత ఉజ్వల భవితకు బాటలు వేయనుందన్నారు. సాంకేతిక, పరిపాలనా.., నిర్వహణ పాత్రలలో శాశ్వత స్థానాలను కలిగి ఉంటుందని చిత్తూరు ఎంపీ తెలిపారు. డేటా సెంటర్ లోపల ప్రతి ఉద్యోగం దాని వెలుపల 3.5 నుంచి 7.4 అదనపు ఉద్యోగాలను సృష్టించగలదని పేర్కొన్నారు.ఇది లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంతటా వేలాది జీవనోపాధి,బిలియన్ల రూపాయలు మౌలిక సదుపాయాలు, పరికరాలు, పునరుత్పాదక ఇంధనం, నిర్మాణాలకు బీజం పడిందన్నారు.రెస్టారెంట్లు, హౌసింగ్ మార్కెట్లు, సర్వీస్ ప్రొవైడర్లు , రవాణా సంస్థలు అభివృద్ధి చెందుతాయని,. విశాఖపట్నం ఆర్థిక వ్యవస్థ ఓడరేవులు, తయారీ వంటి సాంప్రదాయ పరిశ్రమలకు మించి వైవిధ్యభరితంగా మారడంతో పాటు డిజిటల్ ఎక్సలెన్స్ కేంద్రంగా రూపాంతరం చెందనుందన్నారు.ఇది మరింత ఆశాజనకంగా ఉంటుందని, డేటా సెంటర్లలోని అనేక కార్యాచరణ ఉద్యోగాలు సంవత్సరానికి 100,000 కంటే ఎక్కువ సృష్టించేందుకు వీలవుతుందన్నారు. కొన్ని అధికారిక డిగ్రీలు, నైపుణ్యాలు, నిబద్ధత అవసరమని చెప్పిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.., ఆధారిత ఉపాధి నుంచి నైపుణ్యం-ఆధారిత శ్రేయస్సుకు ఈ మార్పు ఆంధ్రప్రదేశ్ .. వెలుపల ఉన్న యువతకు కొత్త తరం స్ఫూర్తినిస్తుందన్నారు.గూగుల్ క్లౌడ్ రాకతో ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక విప్లవం ప్రారంభమైందనీ..,నవ్యాంధ్రప్రదేశ్ సాంకేతిక రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింద న్నారు. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ క్లౌడ్ దాదాపు 15 బిలియన్ డాలర్లు.. (రూ.1.33 లక్షల కోట్ల) పెట్టుబడితో, 2 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించబోతోందనీ.., ఇది కేవలం పెట్టుబడి కాదనీ.., భవిష్యత్ ఆంధ్రప్రదేశ్‌కు బలమైన పునాదన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిరంతర కృషి ఫలితంగా ఈ అద్భుతమైన గ్లోబల్ పెట్టుబడి సాధ్యమైందన్నారు. 12 నెలల నిరంతర కృషితో, జాతీయ విధానాల్లో మార్పులు చేయించి రాష్ట్రానికి ఈ అవకాశాన్ని తీసుకురావడం మంత్రి లోకేష్ నాయకత్వం, సమర్థతకు నిదర్శనమని కొనియాడారు.విశాఖలో ఏర్పడబోయే సబ్ సీ కేబుల్ నెట్వర్క్ అంతర్జాతీయ కనెక్టివిటీకి నూతన గమ్యం కానుందని,. వ్యవసాయం, వైద్యం, విద్య రంగాలపై దీని ప్రభావం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బాటలు వేస్తుందని తెలియజేశారాయన.భవిష్యత్తును హోస్ట్ చేసే గిగావాట్ కేంద్రంగా విశాఖపట్నం మారనుందని, భావితరాలకు..,నిరుద్యోగ యువతీ,యువకులకు ఉద్యోగావకాశాలకు కేంద్ర బిందువు అవుతుందని చెప్పారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది సామాజిక మేలుకొలుపుగా పరివర్తనం చందనుందన్నారు. దీపావళి పర్వదినాన మరిన్ని ఆర్థిక ప్రయోజనాల నాంది పలికి, గొప్ప సంస్కరణగా.., ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చి.. ప్రజల జీవితాలలో వెలుగులు నింపే ప్రాజెక్టుగా గూగుల్ తన ప్రస్థానాన్ని కొనసాగించనుందని ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు వివరించారు.అంతేకాకుండా గూగుల్ క్లౌడ్ రాక ఆంధ్రప్రదేశ్ భారత టెక్నాలజీకి నూతన శక్తి కేంద్రంగా నిలవబోతుందనీ., ఇది కేవలం రాష్ట్రానికి మాత్రమే కాదు, దేశానికి గర్వకారణమైన మైలురాయిగా,. ప్రపంచ “సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం” వైపు చూడటానికి ఇదే కారణమని వెల్లడించారు. ఈ చారిత్రాత్మక అడుగు -భవిష్యత్ తరాలకు ఆశ, అభివృద్ధి, ఆత్మవిశ్వాసం నింపే డిజిటల్ ఆంధ్రప్రదేశ్ వైపు తొలి అడుగు పడిందన్నారు.





