Friday, March 13, 2026

*శాంతియుత సమాజ నిర్మాణమే పోలీసుల లక్ష్యం** సమాజానికి పోలీసుల సేవలు చిరస్మరనీయం* జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్———*

నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )శాంతియుత సమాజ నిర్మాణమే లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తూ ఎందరో పోలీసులు అమరులయ్యారని వారి ప్రాణత్యాగాలను స్మరిస్తూ ప్రతీయేటా అక్టోబర్ 21న పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుటున్నామని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విధి నిర్వహణలో దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల సంస్మరణ పోలీస్ ఫ్లాగ్ డేను జిల్లాలో ఘనంగా నిర్వహించారు.జగిత్యాల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం వద్ద జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్,పోలీస్ అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు.*పోలీసులపై నమ్మకం వల్లే ప్రజలు కంటినిండా నిద్ర*ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..మనం సమాజంలో శాంతియుతంగా,ప్రశాంతంగా జీవిస్తున్నామంటే బోర్డర్స్‌లో పనిచేస్తున్న సైనికులు గాని, సమాజంలో 24 గంటల పనిచేస్తున్న పోలీసు వారే కారణమన్నారు. పోలీసు అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ప్రజావసరాల కోసం, సంరక్షణ కోసం ఏర్పడ్డ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు దేశ అంతర్గత భద్రత ప్రజల రక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఇలా ప్రతి సందర్భాల్లోనూ పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పని చేస్తుందన్నారు.శాంతిభద్రతలు సక్రమంగా ఉంటే మారుమూల గ్రామాలకు అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమానికి హాజరైన అమరవీరుల కుటుంబాల సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థుతులు వారి యొక్క సమస్యలను అడిగి వారు చెప్పిన సమస్యలను సాధ్యమైనoత తొందరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందించారు.ఈ కార్యక్రమంలో డిఎస్పిలు, సీఐ లు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది, అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News