నేటి సాక్షి(పూరెళ్ల బాపు)…….. తెలంగాణ పెన్షనర్ల సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో దీపావళి సమ్మేళనం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్బంగా తెలంగాణ పండుగలు -సంప్రదాయాలపై టీ పెన్షనర్స్ రాష్ట్ర కార్యదర్శి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ప్రసంగించారు. అనంతరం జిల్లా లో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన 12 మంది రిటైర్డ్ ఉద్యోగులకు దీపావళి పురస్కారాలు అందజేశారు.ఈ కార్యక్రమం లో టీ పెన్షనర్ల రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్,అసోసియేట్ అధ్యక్షులు బొల్లం విజయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పి. సి. హన్మంత్ రెడ్డి, కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాతం, ఉపాధ్యక్షులు వెల్ముల ప్రకాష్ రావు, సత్యనారాయణ,ఎం. డీ. యా కూబ్, పి. అశోక్ రావు,సంయుక్త కార్యదర్శులు విఠల్, కట్ట గంగాధర్, జగిత్యాల యూనిట్ అధ్యక్షులు బి. రాజేశ్వర్, కోరుట్ల అధ్యక్షులు పబ్బా శివానందం, మెట్ పల్లి అధ్యక్షులు మురళి, రాయికల్ అధ్యక్షులు వై. వేణు గోపాల్ రావు,ధర్మపురి అధ్యక్షులు కే. గంగాధర్, మల్యాల అధ్యక్షులు ఎం. డీ.యా కూబ్, కార్యదర్శి వీరారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.





