నేటి సాక్షి (జిన్నారం)సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారం మున్సిపల్ పరిధిలోని రాళ్లకత్వ గ్రామా వార్డు విభజనపై ప్రజల్లో ఆందోళన, మున్సిపల్ పరిధిలో కొత్తగా చేపట్టిన వార్డుల విభజనపై స్థానిక ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వార్డుల పునర్విభజనలో తప్పులు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ రాలకత్వ స్థానిక నాయకులు మున్సిపల్ కమిషనర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. వార్డులో సరిహద్దులు సరిగ్గా నిర్ణయించకపోవడంతో పాత కాలనీలు గ్రామాలు విభిన్న వార్డులుగా విడిపోయాయని వారు పేర్కొన్నారు. దీనివల్ల ప్రజలు సౌకర్యాలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ప్రజలు సూచనలు తీసుకుని సరైన మార్పులు చేయాలని స్థానిక నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ తిరుపతి, కి రాళ్లకత్వ గ్రామస్తులు వార్డు విభజన తమ డిమాండ్లను వారికి వివరించారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ స్పందించి త్వరలోనే విభజనపై స్పష్టమైన మార్పులు చేర్పులు చేసి పై అధికారులకు పంపిస్తానని గ్రామస్తులకు తెలిపారు. సందర్భంగా జిన్నారం మున్సిపల్ కమిషనర్, సానుకూలంగా స్పందించినందుకు రాళ్లకత్వ గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.





