Friday, March 13, 2026

ఇదేనా పరిశుభ్రత…?-కబరస్థాన్ ప్రధాన రోడ్డు పై ప్రవహిస్తున్న మురుగునీరు-డ్రైనేజీ సదుపాయం లేక…నానా అవస్థలు పడుతున్న వాహనదారులు-పట్టించుకోని మున్సిపల్ శాఖ అధికారులు.

నేటిసాక్షి, మిర్యాలగూడ :పట్టణంలోని బంగారుగడ్డ కబరస్థాన్ ప్రధాన రోడ్డుపై చిన్నపాటి వర్షానికే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కబరాస్థాన్ ఎదుదూరుగా ఉన్న ప్రధాన రహదారిపై సరైన డ్రైనేజీ లేక చిన్నపాటి వర్షానికే నీరు రోడ్లపై నిలచి, వాహనాలు మురుగునీటిలో కిందపడి ఎన్నో ప్రమాదాలు జరగడమే కాకుండా, ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సీజన్ వ్యాధులపై ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్న, ఈ డ్రైనేజీలు లేక రోడ్డుపైనే మురుగునీరు ప్రవహించడంతో, ఆ మురుగునీరు ఎటు పోలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు నిత్యం ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి, డ్రైనేజీ ని ఏర్పాటు చేసి, ప్రజల ఆరోగ్యం కాపాడాలని ప్రజాసంఘాల నేతలు, వాహదారులు కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News