Friday, March 13, 2026

మండలంలో దాబా(రెస్టారెంట్)లపై తనిఖీలు ఏవి*దాబాలపై కానరాని సంబంధిత శాఖ అధికారుల దాడులుముడుపులతో అధికారుల తనిఖీలు శూన్యం.

నేటిసాక్షి/మంగపేటమండల పరిధిలోని కమలాపురం హైవే పక్కన రాము రుచి ధాబా(రెస్టారెంట్)లు పూర్తి అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారు అని ప్రజలు ఆరోపిస్తున్నారు దాబా (రెస్టారెంట్) నడపాలంటే గ్రామపంచాయతి లైసెన్సు అలాగే ఫుడ్ లైసెన్సు రెస్టారెంట్ ప్రభుత్వపు లైసెన్స్ తప్పని సరిగా తీసుకోవాలి ఇవన్నీ ఏమి లేకుండానే ఇష్టం వచ్చినట్లు వ్యవహారిస్తున్నారు అని ప్రజలు అనుకుంటున్నారు పంచాయతీ అధికారులకు తెలిసినా తెలవనట్టు వ్యవహరించడం వెనుక అంతర్యమేమిటో వారికే తెలియాలి అని ప్రజలు అనుకుంటున్నారు సామాన్య ప్రజలనుండి పన్నులు ముక్కుపిండి వసూలు చేసే అధికారులు ఈ దాబా(రెస్టారెంట్)ల పై అంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు అని చర్చించుకొంటున్నారు. ధాబా(రెస్టారెంట్) ఏర్పాటు కోసం గతంలో షెడ్డు ఏర్పాటు చేశారు దీనికి ఎలాంటి పంచాయతీ అనుమతులు తీసుకోకుండానే కొన్ని నెలల నుండి దాబా (రెస్టారెంట్)నిర్వహిస్తున్నారు నేషనల్ హైవే పక్కన పూర్తి అనుమతులు లేకుండా యదేచ్చగా దాబా(రెస్టారెంట్) నిర్వహిస్తుంటే నిత్యం మండలానికి వెళ్లే అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం వెనుక అక్రమ నిర్మాణాలకు అధికారులు సహకరిస్తున్నారని ఆరోపణలు కూడా వస్తున్నాయి.*దాబా(రెస్టారెంట్)ల్లో జోరుగా మద్యం సిట్టింగ్‌లు*పగలూ రాత్రి అనే తేడా లేకుండా ధాబా(రెస్టారెంట్)ల్లో మద్యం సిట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు దీనివలన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాలకు దాబా(రెస్టారెంట్)ల్లో మద్యం సిట్టింగ్‌ లే కారణమని ఆరోపణలు ఉన్నాయి దాబా(రెస్టారెంట్)ల్లో మద్యం తాగడానికి ఎలాంటి అనుమతులు లేవు గత కొన్ని సంవత్సరాలుగా దాబా(రెస్టారెంట్)ల్లో మద్యాన్ని పూర్తిగా నిషేధించారు కానీ ఈ మధ్య కాలంలో దాబా(రెస్టారెంట్)ల్లో జోరుగా మద్యం సిట్టింగ్‌లు కొనసాగుతున్నాయి దాబా(రెస్టారెంట్)ల నిర్వాహకులు ఏటూరునాగారంలో ఉన్న మద్యం దుకాణాల నుంచి మద్యాన్ని తీసుకొస్తున్నట్లు సమాచారం అంతే కాకుండా కొంత మంది వాహనదారులు మద్యం బాటిళ్లను బయట నుంచి తెచ్చుకొని తాగుతున్నారు ఆ తర్వాత వారు మద్యం మత్తులో వాహనాలను అతివేగంతో జాతీయ రహదారిపై నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు ఈ ప్రమాదాలలో ప్రాణనష్టం జరగడమే కాకుండా అనేక మంది క్షతగ్రాతులు అవుతున్నారు*అంతంతమాత్రంగానే సంబంధిత అధికారుల తనిఖీలు*దాబా(రెస్టారెంట్)ల్లో మద్యం సిట్టింగ్‌లు గానీ, మద్యం అమ్మకాలు గానీ లేకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదే కానీ రాష్ట్ర రహదారికి పక్కన ఉన్న దాబా(రెస్టారెంట్)ల్లో సంబంధిత అధికారులు అడపాదడపా తనిఖీలు చేసి చేతులు దులుపుకొంటున్నారు దాబా(రెస్టారెంట్)లోకి సంబంధిత అధికారులు గానీ తనిఖీలకు వేళ్తే ముందుగానే సమాచారం చేరవేస్తున్నారు దీంతో దాబా(రెస్టారెంట్)ల నిర్వాహకులు అప్రమత్తం అవుతున్నారు రాత్రి సమయాల్లో దాబా(రెస్టారెంట్)ల నిర్వాహకులు మద్యం సిట్టింగ్‌లను జోరుగా కొనసాగిస్తున్నట్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు దాబా(రెస్టారెంట్)ల నిర్వాహకులు ఇచ్చే మామూళ్లకు ఆయా శాఖల అధికారులు తలొగ్గుతూ సక్రమంగా తనిఖీలు నిర్వహించడం లేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి ఈ దాబా(రెస్టారెంట్)ల్లో మద్యంలో తాగిన వాహనదారులు అతివేగంగా వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News