Friday, March 13, 2026

బాత్రూం లో పడి వివాహిత మృతి.

నేటిసాక్షి (కె గంగాధర్)పెగడపల్లిబతకెపెల్లి గ్రామానికి చెందిన శ్రీరామ్ కేత,(32) ప్రమాదావశాత్తు బాత్రూం లో జారిపడి మృతి చెందింది వివరాల్లోకి వెళ్తే కేత రెండు సంవత్సరాల నుండి తన రెండు కాళ్ల మడమలకి గుర్రపు మూతులు అను నొప్పులతో బాధపడుతుంది. అట్టి నొప్పులతో బాధపడుతూ దానికి సంబంధించి చికిత్స తీసుకున్న నయం కాకపోవడంతో పది రోజుల క్రితం అట్టి నొప్పులు నయం కావడానికి ఆయుర్వేద మందులు వాడడం వల్ల కాలి మడమలకి పుండ్లు అయినాయి అట్టి పుండ్ల వలన సరిగా నడవలేక ఇబ్బంది పడుతూ ఆరోగ్యం సరిగా లేక ఈరోజు ఉదయం 11 గంటలకు బాత్రూంలో బోర్లపడి అపస్మారక స్థితిలోకి వెళ్ళగా, అక్కడి నుండి వెంటనే ఆమె తండ్రి కావటి మల్లయ్య జగిత్యాల ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయినట్లు ధ్రువీకరణ చేయడమైనది.ఆమె మరణం పై ఆమె తండ్రి కావటి మల్లయ్య యొక్క ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News