Friday, March 13, 2026

లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి** జగిత్యాల కలెక్టర్ బి. సత్యప్రసాద్* ఈజీఎస్, 15వ ఆర్థిక సంఘం నిధులతో భవన నిర్మాణాల పరిశీలన* నాణ్యత ప్రమాణాలు తప్పనిసరి * ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి సహకారం* అధికారులపై కలెక్టర్ సీరియస్ సూచనలు—*

నేటి సాక్షి – రాయికల్*జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మంగళవారం రాయికల్ మండలంలోని పలు గ్రామాలను సందర్శించి ఇందిరమ్మ ఇళ్లు, అంగన్వాడీ సెంటర్లు, గ్రామ పంచాయతీ భవనాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు వంటి ప్రభుత్వ నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు.పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, లబ్ధిదారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.—*ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి*రాయికల్ మండలంలోని సింగరావుపేట, శ్రీరాంనగర్, ఇటిక్యాల గ్రామాల్లో కలెక్టర్ బి. సత్యప్రసాద్ పర్యటించారు.ఈ సందర్భంగా సింగరావుపేట గ్రామంలో లబ్ధిదారులను కలుసుకుని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.పనులు ప్రారంభించని వారు వెంటనే నిర్మాణం ప్రారంభించాలని సూచించారు.ఎన్ని ఇండ్లు గ్రౌండ్ ఫ్లోర్ దశలో ఉన్నాయో, ఎన్ని స్లాబ్ దశకు చేరుకున్నాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు.“ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుంది, కానీ రవాణా ఖర్చులు, కూలీ వేతనాలు లబ్ధిదారులు చెల్లిస్తే ఇసుక ఉచితంగా మీకు అందుతుంది” అని కలెక్టర్ వివరించారు.ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి సెర్ప్ ద్వారా రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోండి అని అధికారులకు ఆదేశించారు.—*అంగన్వాడీ, గ్రామ పంచాయతీ భవనాల పరిశీలన*శ్రీరాంనగర్‌లోని అంగన్వాడీ, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు.ఈజీఎస్ నిధుల ద్వారా జరుగుతున్న ఈ పనులు నాణ్యత ప్రమాణాలతో, నిర్దేశిత సమయానికి పూర్తవ్వాలని సూచించారు.“ప్రజలకు అందే సేవలలో ఆలస్యం జరగకూడదు. పనులు త్వరగా పూర్తి చేయడం ద్వారా ప్రభుత్వ నిధుల ప్రయోజనం ప్రజలకు అందాలి” అని పేర్కొన్నారు.—*ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం పనులు వేగవంతం చేయాలి*15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం (PHC) పనులను కూడా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు.నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.“నిర్మాణ పనులు పూర్తి చేయడం ద్వారా గ్రామ ప్రజలకు వైద్యసదుపాయాలు త్వరగా అందుబాటులోకి రావాలి” అని కలెక్టర్ తెలిపారు.ఈ పర్యటనలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, ఈఈ (పీఆర్) లక్ష్మణ్ రావు,జిల్లా హౌసింగ్ పీడీ ప్రసాద్, ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు తదితరులు పాల్గొన్నారు.____

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News