Wednesday, March 18, 2026

పోలీసు అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం పేట సీఐ శివ శంకర్.

నేటి సాక్షి,నారాయణపేట, అక్టోబర్ 23, పేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లో పోలీసుల పనితీరు పై విద్యార్థులకు అవగాహనప్రజలకు పోలీసుల సేవలు ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రాముఖ్యత. పోలీస్ చట్టాల పైన అవగాహన,పోలీస్‌ అమరవీరుల సంస్మరణలో(పోలీస్ ఫ్లాగ్ డే) భాగంగా ఈరోజు నారాయణపేట పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో విద్యార్థిని విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని ఉద్ధ్యేశించి సి శివ శంకర్ గారు మాట్లాడుతూ…అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటు పోలీస్ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలపై, పోలీస్ శాఖ పనితీరు, వైర్లెస్ సెట్ ద్వారా మాట్లాడే విధానం, పోలీసు లాకప్, FIR రిజిస్ట్రేషన్ విధానం, సీసీ కెమెరాల పనితీరు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ చేసే విధానం, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే నష్టాలు, డయల్ 100 సేవలు, రిసెప్షనిస్ట్ పనితీరు, 24 గంటలకు ప్రజలకు అందుబాటులో ఉండే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అని, పాత నేరస్తులను గుర్తుపట్టడానికి ఫింగర్ ప్రింట్ ద్వారా గుర్తించడం లాంటి వివిధ అంశాలపై విధ్యార్ధిని, పోలీసు ఆయుధాల పనితీరు, సంఘవిద్రోహ శక్తుల చేతిలో చనిపోయిన పోలీస్ అమరవీరుల గురించి, భరోసా సెంటర్, షి టీమ్ పోలీసులు, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఊదేశ్యంతో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థులు విద్యతో సమాజంలో జరుగుతున్న పరిణామాల పై అవగహన పెంచుకోవాలన్నారు. విద్యార్ధులు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ అంటే ఏమిటి, అది ప్రజలకు శాంతి భద్రతల విషయంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని పని విధానం ఏవిధంగా ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అందు కోసం పోలీస్ స్టేషన్లో విద్యార్థులకు అవగహన కల్పించడం జరిగింది అని తెలిపారు.పైవిషయాలకు సంబంధించి అర్మోరర్లు, ఫింగర్ ప్రింట్స్, కమ్యూనికేషన్ సిబ్బంది, డయల్ 100 పోలీసులు, పోలీస్ స్టేషన్ సెక్షన్ ఇంచార్జ్ తదితరులు విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరును వివరించడం జరిగింది. ఈకార్యక్రమంలో టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, మద్దయ్య, గాయత్రి, పోలీస్ సిబ్బంది, విద్యార్ధులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News