Wednesday, March 18, 2026

అండర్ బ్రిడ్జిల వద్ద నీరు నిలవకుండా జాగ్రత్త పడండి. నగరపాలక సంస్థ కమిషనర్,ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ ఎన్. మౌర్య.

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*తిరుపతి*. వర్షాల వలన తిరుపతి నగరంలోని అండర్ బ్రిడ్జిల్లో వర్షపు నీరు నిలవకుండా తగుచర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ , ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ ఎన్. మౌర్య అధికారులను ఆదేశించారు. వర్షాలతో నగరంలోని డి.ఆర్. మహల్, ఆర్.సి.రోడ్డు, బాలాజీ కాలనీ అండర్ బ్రిడ్జిల ను బుధవారం ఉదయం పరిశీలించి అండర్ బ్రిడ్జిల కింద వర్షపు నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు మోటార్లతో పంపింగ్ చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. కమిషనర్ వెంట కార్పొరేటర్ ఎస్.కె.బాబు, డి.ఈ. మహేష్, ఇంజినీరింగ్, పారిశుధ్య సిబ్బంది ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News