నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)శ్రీవారి మెట్లు చిరు వ్యాపారస్తుల సమస్యలను పరిష్కరించాలని తక్షణమే లైసెన్స్ ఇవ్వాలని గత 4 28 రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తున్నారు. ఆ సమస్యను పరిష్కరించాలని ఈరోజు తిరుమల తిరుపతి పరిపాలన భవనం ఎదురుగా ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు జి బాలసుబ్రమణ్యం జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఎస్ జయచంద్ర టి. సుబ్రహ్మణ్యం…….మాట్లాడుతూ శ్రీవారి మెట్లు చిరు వ్యాపారస్తులు లైసెన్స్ ఇవ్వాలని ఇవ్వాలని గత 428 రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తున్న ప్రభుత్వం టిటిడి పాలకమండలి పట్టించుకోవడం లేదు. అనేకసార్లు అధికారుల చుట్టూ విన్నతులు చేసిన ఏమాత్రం పట్టించుకోకుండా పెడుతున్నారు. 30 కుటుంబాలు అన్నమో రామచంద్రాన్ని ఆకలితో అలమటిస్తున్నారు. వారి కుటుంబాలన్నీ వీధిన పడినాయి. కనికరించాల్సిన పాలకులు వారి చెవులకు కనులకు నిరసన దీక్ష కనపడలేదని ప్రశ్నించారు. వర్షాల సైతం లెక్కచేయకుండా నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. టిటిడి యాజమాన్యం తక్షణమే ఈ సమస్యను పరిష్కరించుకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ లక్ష్మి బుజ్జి ఉపాధ్యక్షులు వేణు గోపాల్, శ్రీవారి మెట్లు యూనియన్ నాయకులు చిట్టిబాబు యుగంధర్ చిరంజీవి ప్రకాష్ పెంచలయ్య రామ్మూర్తి మల్లికార్జున గోపి తదితరులు పాల్గొన్నారు……





