Wednesday, March 18, 2026

మాజీ సైనికుల రాష్ట్ర కమిటీ గుంటూరు పర్యటన విజయవంతం** రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు* మాజీ సైనికుల భవన నిర్మాణ పనులు పరిశీలన * రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర,జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణ షీలా, మాజీ సైనికులు.

నేటి సాక్షి, బాపట్ల జిల్లా ప్రతినిధి గుంటూరు, బాపట్ల మరియు పల్నాడు జిల్లాల లోని మాజీ సైనికుల సమస్యలపైన మరియు మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు అందుతున్న సంక్షేమం పైన వాకబు చేస్తూ, గుంటూరు లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం యొక్క స్టేట్ కమిటీ చేసిన పర్యటన విజయవంతం అయినట్లు రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తెలిపారు. తమ పర్యటన లో భాగంగా గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ కార్యాలయాన్ని మరియు మాజీ సైనికుల వైద్యశాల అయినటువంటి ECHS పాలిక్లినిక్ ను సందర్శించినట్లు రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తెలియ జేశారు. రాష్ట్ర కమిటీ గుంటూరు పర్యటన లో భాగంగా గుంటూరు, బాపట్ల మరియు పల్నాడు జిల్లాల లోని పలు అసోసియేషన్ ల ప్రతినిధులు స్టేట్ కమిటీ ప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలిసి, పర్యటనలో భాగస్వాములు కాగా, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా గుంటూరుకు చేరుకోలేని కొన్ని అసోసియేషన్ ల ప్రతినిధులు ఫోన్ ల ద్వారా స్టేట్ కమిటీకి తమ యూనియన్ ల విషయాలను జిల్లాలో జరుగుతున్న పరిస్థితులను తెలియ జేశారు.గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా, గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ కార్యాలయానికి చేరుకోగా, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి గుణ షీలా, సైనికులకు/ మాజీ సైనికులకు మరియు మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు తమ కార్యాలయంలో అందిస్తున్న సేవల గురించి వివరించారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ, ఉమ్మడి గుంటూరు జిల్లా లోని జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసు పని తీరు అద్భుతంగా ఉందని తెలియ జేశారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసు ప్రాంగణంలో మాజీ సైనికుల కోసం షుమారు రెండు కోట్ల తొంబై రెండు లక్షల (2,92,00000/_)రూపాయల తో భారీగా నిర్మిస్తున్న సైనిక్ ఆరామ్ ఘర్ నూతన భవన నిర్మాణ పనులను జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి గుణ షీలా మరియు సూపరింటెండెంట్ ఆనందరావు లతో కలిసి రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు బృందం పరిశీలించి సంతృప్తిని వ్యక్త పరిచారు. మాజీ సైనికుల సంక్షేమం కోసం గుంటూరు లో ఇంత పెద్ద నిర్మాణాన్ని చేపడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు ఆంధ్రప్రదేశ్ రాజ్య సైనిక్ బోర్డు వారికి అదేవిధంగా ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న కేంద్ర సైనిక్ బోర్డు వారికి కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున అధ్యక్షులు తాండ్ర ధన్యవాదాలు తెలిపారు. మాజీ సైనికుల కోసం నిర్మిస్తున్న సైనిక్ ఆరామ్ ఘర్ నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, చాకచక్యంగా వ్యవహరిస్తూ కలెక్టర్ స్థాయి అధికారులకు కూడా వాస్తవాలను, అవశ్యకతలను తెలియ జేసి, జిల్లాసైనిక్ వెల్ఫేర్ కార్యాలయానికి అద్భుతమైన నూతన మార్గాన్ని కూడా మంజూరు చేయిస్తున్న గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి గుణ షీలా కు రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర తో పాటు స్టేట్ కమిటీ సభ్యులు అభినందనలు తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న వార్ విడోస్ కు సైతం ఇళ్ల స్థలాలు మంజూరు చేయించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణ షీలా కు మాజీ సైనికుల కుటుంబ సభ్యుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపతున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర అన్నారు. జిల్లాలో మాజీ సైనికులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల పై జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారులతో స్టేట్ కమిటీ బృందం ముచ్చటించారు.అద్భుతమైన పని తీరుతో సేవలు అందిస్తున్న గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ కార్యాలయ సిబ్బందికి అభినందనలు తెలియ జేసి, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణ షీలా ను దుస్సాలువాతో సన్మానించి పుష్ప గుచ్చాన్ని అందించారు.అనంతరం రాష్ట్ర కమిటీ బృందం మాజీ సైనికుల వైద్యశాల అయినటువంటి ECHS పాలిక్లినిక్ ను సందర్శించి, పాలిక్లినిక్ అధికారి శ్రీ చైతన్య కు పుష్ప గుచ్చాన్ని అందించారు. మాజీ సైనికుల కు మరియు మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కమిటీ కోరగా, వెంటనే ఏలాంటి సమస్య ఉన్నా పరిష్కరించటానికి సిద్ధంగా ఉన్నట్లు పాలిక్లినిక్ ఇంచార్జి అధికారి శ్రీ చైతన్య తెలపగా రాష్ట్ర కమిటీ సంతృప్తిని వ్యక్త పరిచారు. కార్యక్రమంలో స్టేట్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ సూరెడ్డి శివకుమార్, గౌరవాధ్యక్షులు అన్నే రామారావు, రాష్ట్ర కమిటీ గౌరవ సలహాదారులు సుంకర శేషగిరి రావు, బాపట్ల జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు నజీర్ అహమ్మద్, ఉపాధ్యక్షులు బాలా శివా రెడ్డి, పొన్నూరు అసోసియేషన్ అధ్యక్షులు షేక్ మస్తాన్, బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్టా ఆదిశేషా రెడ్డి, ఉమ్మడి గుంటూరు జిల్లా కో ఆర్డినేషన్ కమిటీ జనరల్ సెక్రెటరీ నరసింహం, గుంటూరు అసోసియేషన్ ట్రెజరర్ పి ప్రసాద్, మొహమ్మద్ గౌస్ మరియు స్థానిక గుంటూరు అసోసియేషన్ మాజీ సైనికులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News