Friday, March 13, 2026

మెగా బ్లడ్ క్యాంప్ విజయవంతం సమాజ సేవకులు మోపర్తి జాన్ జన్మదిన సందర్భంగా 200 మంది యువత రక్తదానం హర్షం వ్యక్తం చేసిన బాపట్ల ఆర్డిఓ, డి.ఎం.హెచ్.ఓసమాజ శ్రేయస్సుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని కితాబు.

నేటి సాక్షి, బాపట్ల జిల్లా (కర్లపాలెం) ప్రముఖ సమాజ సేవకులు మోపర్తి జాన్ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైంది . కర్లపాలెంలోని కేర్ క్యాంపస్ నందు బుధవారం 200 మంది యువకులు, సామాజిక సేవా నిబద్ధత కలిగిన ప్రజలు పాల్గొని రక్తదానం చేశారు. నీడ్స్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఈ రక్త దాన శిబిరాన్ని బాపట్ల ఆర్డిఓ గ్లోరియా, కర్లపాలెం, బాపట్ల తహసిల్దార్లు షాకీర్ పాషా, సలీమా ప్రారంభించగా.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎస్. విజయమ్మ రక్తదాతలకు సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా బాపట్ల ఆర్డిఓ గ్లోరియా మాట్లాడుతూ తన జన్మదిన సందర్భంగా ఓ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సమాజ సేవకులు మోపర్తి జాన్ ను అభినందించారు. సమాజ శ్రేయస్సు కోసం ఇలాంటి కార్యక్రమాలు జరగడం అభినందనీయం అన్నారు. డిఎంహెచ్ ఓ డాక్టర్ విజయమ్మ మాట్లాడుతూ రక్తదానం ద్వారా అనేక ప్రాణాలను రక్షించే అవకాశం లభిస్తుందన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రజలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తామన్నారు. సమాజ సేవకులు మోపర్తి జాన్ మాట్లాడుతూ తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరానికి అనుహ్య స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ నిస్సి జోసఫ్, మిషన్స్ డైరెక్టర్ స్టీవ్ కాలిన్స్, బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు పూర్ణచంద్ర ,సాంబశివ రెడ్డి ,బ్యూలా లివింగ్ స్టన్ , ల్యాబ్ టెక్నీషియన్ బుజ్జిబాబు, అంటరాని నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చార్వాక , దళిత నాయకులు పరమానంద కుమార్, ఆర్మీ విజయ్, కర్లపాలెం మాజీ సర్పంచ్, ఉపసర్పంచ్ శ్రీనివాసరావు, అజీమ్ ఖాన్, టిడిపి నాయకులు పఠాన్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News