Friday, March 13, 2026

సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే ఏలూరి భేటీ* •నియోజకవర్గ అభివృద్ధిపై సుదీర్ఘ చర్చ•మిగిలిన నల్ల బర్లీ కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని వినతి•నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కృషి పట్ల ఎమ్మెల్యేకి అభినందనలు•సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు •పరిష్కారానికి ఎమ్మెల్యే ఏలూరికి హామీ•రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే ఏలూరి.

నేటి సాక్షి, బాపట్ల జిల్లా ప్రతినిధి (పర్చూరు)అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బేటీ అయ్యారు. ఈ సందర్భంగా పర్చూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గంలో ప్రజలు,రైతుల అవసరాలకు అనుగుణంగా ముందు చూపుతో అభివృద్ధి పనులు చేస్తున్న తీరు పట్ల సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే ఏలూరికి అభినందనలు తెలిపారు. ప్రజల అవసరాలు, స్థానిక సమస్యలు, మౌలిక వసతుల అభివృద్ధి ప్రతిపాదనలను ఎమ్మెల్యే సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా బర్లీ పొగాకు రైతులను ఆదుకునే చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు.దేశ చరిత్రలో ఎక్కడ ఎన్నడూ లేని విధంగా కష్టాల్లో ఉన్న నల్లబర్లీ పొగాకు రైతులకు భరోసా కల్పిస్తూ, ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు.ఇంకా రైతుల వద్ద నిల్వ ఉన్న పొగాకు, ఆ మొత్తాన్ని కూడా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబునాయుడును కోరారు.*రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యం*రాష్ట్రంలో ప్రతి రైతు పంటకు గ్యారంటీ లభించేలా సీఎం కృషి చేస్తున్నారని ఏలూరి పేర్కొన్నారు.“బర్లీ పొగాకు రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో, ప్రభుత్వం కొనుగోలు ప్రారంభించడం రైతు కుటుంబాలకు ఊరట ఇచ్చింది.ఇది ప్రభుత్వ రైతు సంక్షేమానికి అంకితభావానికి నిదర్శనం” అని అన్నారు.చీరాల నుంచి మోటుపల్లి వరకు రహదారి నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ రహదారి పూర్తయితే తీరప్రాంత పర్యాటకాభివృద్ధికి, మత్స్యకారుల రవాణాకు, వ్యాపారానికి ఊతమిస్తుందని తెలిపారు. మార్టూరు మండలంలోని కొలలపూడి, వలపర్ల, బొల్లాపల్లి గ్రామాలు, చిన్నగంజాం మండలంలోని కడవకుదురు, రాజు బంగారు పాలెం, ఇంకొల్లు మండలంలోని కొణికి గ్రామాల్లో 33 కెవి సబ్ స్టేషన్లు నిర్మించాలని అభ్యర్థించారు. విద్యుత్ సరఫరా సమస్యలు అధికంగా ఉన్న ఈ ప్రాంతాల్లో సబ్‌స్టేషన్లు ఏర్పడితే గ్రామీణ విద్యుత్ స్థిరత్వం పెరుగుతుందని ఆయన వివరించారు.ఇంకొల్లు, మార్టూరు, పర్చూరు మండల కేంద్రాల్లో ఆటో నగర్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సీఎం చంద్రబాబును కోరారు. యువత ఎక్కువగా చేతివృత్తులపై ఆధారపడి ఉన్నందున పరిశ్రమల అభివృద్ధికి ఇది తోడ్పడుతుందని తెలిపారు. అలాగే మార్టూరు యద్దనపూడి మండలాలను మార్టూరు సర్కిల్ పరిధిలోకి, ఇంకొల్లు చిన్నగంజాం మండలాలను ఇంకొల్లు సర్కిల్ పరిధిలోకి, పర్చూరు, కారంచేడు పోలీస్ స్టేషన్లను కలిపి పర్చూరు సర్కిల్ గా ఏర్పాటు చేయాలని సూచించారు.పర్చూరు నియోజకవర్గ పరిధిలో బకింగ్‌హామ్ కాలువను అంతర్గత జలమార్గంగా (Inland Water System) అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే రవాణా, పర్యాటకం, నీటిపారుదల రంగాలకు పెద్ద ఊతమవుతుందని తెలిపారు. మార్టూరు మండలం నాగరాజుపల్లిలోని ఏపీఐఐసీ పార్క్ సమీపంలో చెరువును అభివృద్ధి చేసి ఎంఎస్‌ఎంఈ పార్క్ కు అనుసంధానించాలని కోరారు.మార్టూరు మండల కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఆయన అభ్యర్థించారు. ప్రస్తుతం నియోజకవర్గంలోని మూడు మండలాలు బాపట్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో, మరో మూడు మండలాలు చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నందున పరిపాలనా ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు.వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 11 పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించాలని ఎమ్మెల్యే ఏలూరి సీఎంను కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధి కోసం కమ్యూనిటీ హాల్స్, అంబేద్కర్ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఆరు మండల కేంద్రాల్లో అంబేద్కర్ భవనాలు నిర్మిస్తే సామాజిక సమతా వేదికలుగా అవి ఉపయోగపడతాయని అన్నారు.పర్చూరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు గుంటూరు ఛానల్ పొడిగింపుకు 51 ఎకరాల భూసేకరణ నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రావెల్ రోడ్ల నిర్వహణ లేకపోవడంతో పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గ్రావెల్ రోడ్ల మరమ్మత్తులకు తక్షణ నిధులు విడుదల చేయాలని కోరారు.నియోజకవర్గంలో సుమారు 5000 వేల ఎకరాల ఇనాం, ఎస్టేట్ ల్యాండ్స్ సమస్య అనేక దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సమస్య పరిష్కారానికి అడుగులు పడ్డాయని, సమస్యకు తక్షణ పరిష్కారం చూపించాలని ఎమ్మెల్యే అభ్యర్థించారు. పర్చూరు, మార్టూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను 100 పడకల ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్ చేయాలని, మార్టూరు మండలంలోని వలపర్ల, చిన్నగంజాం మండలంలోని పెద్దగంజం, మోటుపల్లి గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.ముస్లిం మైనారిటీ వర్గాల కోసం షాదీ ఖానాలు, ఈద్గాలు, బరియల్ గ్రౌండ్స్ కు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. మార్టూరు మండల పరిధిలోని రాజుపాలెం డొంక నుంచి జయంతినగర్ చర్చి వరకు సుమారు 3 కిలోమీటర్ల రహదారి, మార్టూరు-కొణిదేన రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.పర్చూరు నియోజకవర్గం ప్రధానంగా వ్యవసాయ ఆధారితమైందని, వరద కాలువలు సరిగా లేకపోవడం వల్ల తుఫానులు, వర్షాకాలంలో పంటలు నీటమునుగుతున్నాయని ఎమ్మెల్యే వివరించారు. సుమారు 40 కిలోమీటర్ల డ్రైనేజ్ వ్యవస్థను ఆధునికరించి రైతాంగానికి రక్షణ కల్పించాలని ఆయన కోరారు.ఎమ్మెల్యే ఏలూరి సూచించిన అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News