Friday, March 13, 2026

*సింగరేణి లో కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న డాక్టర్స్*

నేటి సాక్షి గోదావరిఖని (రమేష్)సరైన వైద్యం అందించడం లో వైఫల్యం చెందిన గైనకాలజిస్ట్, ఇతర డాక్టర్ లపై చర్యలు తీసుకోవాలి. నిపుణులను నియమించక పోవడం వల్ల అవి నిరుపయోగం. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల గోదావరిఖని ఏరియా హాస్పిటల్ లో ఉన్న వైద్యులు పేషేంట్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం ల ఆరోపణ.సింగరేణి లో కార్మికుల కు సరైన వైద్యం అందించక వారి ప్రాణాలతో వైద్యులు చెలగాటం ఆడుతున్నారని, కార్మికుల కు వైద్యం అందించడం లో నిర్లక్ష్యం వహించిన డాక్టర్ లపై యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం లు డిమాండ్ చేశారు. బుధవారం గోదావరిఖని భాస్కర్ రావు భవన్ లో జరిగిన ఏఐటియుసి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ… గోదావరిఖని సింగరేణి ఏరియా హాస్పిటల్ కు డెలివరీ కోసం వచ్చిన గర్భిణీ కి సకాలంలో సరైన వైద్యం అందించక‌‌‌ పోవడం వల్ల గర్భస్థ శిశువు మరణించించిదని, దీనికి కారణం హాస్పిటల్ గైనకాలజిస్ట్ అని ఆరోపించారు. ఏరియా హాస్పిటల్ లో లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన విలువైన వైద్య పరికరాలు ఉన్నా నిపుణులు లేక పోవడం వల్ల అవి నిరుపయోగం గా ఉంటున్నాయని, వైద్య పరికరాలు పని చేసే విధంగా నిపుణులను నియమించి కార్మికుల కు మెరుగైన వైద్యం అందించాలని గత ఏడాది వైద్యాధికారులకు, సింగరేణి యాజమాన్యం కు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. గర్భిణీ కి సకాలంలో ఏరియా హాస్పిటల్ లో స్కానింగ్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించేందుకు విలువైన వైద్య పరికరాలను నిర్వహించే వైద్య నిపుణులు లేకపోవడం వైద్య పరీక్షల కోసం ప్రైవేటు స్కానింగ్ సెంటర్స్ కు పంపడం వల్ల గర్భస్థ శిశువు మరణానికి ఇదొక కారణమని ఆరోపించారు. శుక్రవారం గోదావరిఖని ఏరియా హాస్పిటల్ కు వచ్చిన గర్భిణీ ని కనీసం డ్యూటీ డాక్టర్ లు కూడా పరీక్షించకుండా నిర్లక్ష్యం చేసి వైద్యం అందించక పోవడం విచారకరమని మండి పడ్డారు. సింగరేణి లో కార్మికులు కష్టపడి బొగ్గు ఉత్పత్తి చేసి లాభాలు తీసుకువస్తే అట్టి లాభాలను సింగరేణి సంస్థ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయకుండా యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి దారాదత్తం చేస్తుందని ఆరోపించారు. కార్మికుల కు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించాలని ఏఐటియుసి పలు సార్లు జరిగిన స్ట్రక్చర్ సమావేశాల్లో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందని పేర్కొన్నారు, యాజమాన్యం కార్మికుల కు అందించే వైద్యం పై సరైన చర్యలు చేపట్టక పోవడం వల్ల సింగరేణి లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా యాజమాన్యం గోదావరిఖని ఏరియా హాస్పిటల్ లో జరిగిన గర్భస్థ శిశువు మరణానికి కారణమైన గైనకాలజిస్ట్ డాక్టర్ లపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సింగరేణి లో లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన విలువైన వైద్య పరికరాలను నిర్వహించే విధంగా వైద్య నిపుణులను వెంటనే నియమించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా సమావేశంలో ఏఐటియుసి నాయకులు దాసరి శ్రీనివాస్, అటికేటి రాజు, బి.సంతోష్ రెడ్డి , నందిని నరేశ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News