నేటి సాక్షి గన్నేరువరం,(బుర్ర అంజయ్య గౌడ్): విద్యార్థి దశ నుండి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని గన్నేరువరం ఎస్సై జి నరేందర్ రెడ్డి అన్నారు గురువారం స్థానిక విజ్ఞాన్ కాన్వెంట్ హై స్కూల్ విద్యార్థులకు పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు చట్టాలు నేరాలు శిక్షలు పోలీస్ స్టేషన్లో నిర్వహణ ఆయుధాలు వినియోగం కలిగించారు.పలు అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుండే చట్టాలపై అవగాహన కలిగి ఉంటే నేరాలు చేయడానికి జంకుతారని అన్నారు. చట్టాలు ఏ విధంగా ఉపయ వినియోగించుకోవాలో అవగాహన కలిగి ఉంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బూర వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు





