నేటి సాక్షి(పూరెళ్ల బాపు)…………….న్యూఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి ఇంటర్ , స్కూల్ పోటీలలో జగిత్యాల పట్టణానికి చెందిన అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. అకాడమిక్స్, కల్చరల్, స్పోర్ట్స్ లోని వివిధ విభాగాలలో విద్యార్థులు పతకాలు సాధించారు. చెస్ లో 2 , తైక్వండో లో 2 , మ్యూజిక్ లో 6 మరియు ఇంగ్లీష్ ఎక్షేమ్పోర్ విభాగంలో 1 గోల్డ్ మెడల్ మొత్తంగా 10 గోల్డ్ మెడల్స్, 16 సిల్వర్ మెడల్స్ మరియు 13 బ్రోన్జ్ మెడల్స్ సాధించారు. వివిధ రాష్ట్రాల నుండి 1200 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ ఈవెంట్ లో జగిత్యాల అకాడమీక్ హైట్స్ పాఠశాలకు చెందిన 54 మంది విద్యార్థిని విద్యార్థులు చెస్, మ్యూజిక్, అథ్లెటిక్స్, టేబుల్ టెన్నిస్, సైన్స్ క్విజ్, జి కే,, స్పెల్తన్ , లాంగ్వేజ్ స్కిల్స్, ఫైన్ ఆర్ట్స్, డాన్స్ వంటి విభాగాలలో పాల్గొన్నారు. 54 మందివిద్యార్థులు పోటీలో పాల్గొనగ 39 మంది విద్యార్థులు పతకాలు సాధించి జగిత్యాల పేరును జాతీయ స్థాయిలో ఘనంగా చాటిచెప్పారు.విజేతలకు ఒలింపిక్స్ పతక విజేత, పద్మశ్రీ బజరంగ్ పూనియా బహుమతులు అందచేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం వెల్మ జీవన్ రెడ్డి , వెల్మ నవీన్ రెడ్డి , గడ్డం రాణి, వెల్మ సమత, ఉపాధ్యాయ బృందం,జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, బతికేపల్లి మాజీ సర్పంచ్ తాటిపర్తి శోభారాణి, యూత్ కాంగ్రెస్ జగిత్యాల టౌన్ అధ్యక్షులు తాటిపర్తి పరీక్షిత్ రెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందించారు.





