Saturday, March 14, 2026

*మాదక ద్రవ్యాల వినియోగిస్తే శిక్షలు తప్పవు* * బాపట్ల పట్టణ సీఐ రాంబాబు.

నేటి సాక్షి, బాపట్ల జిల్లా (బాపట్ల టౌన్) ఈగల్ చీఫ్ ఆకే రవి కృష్ణ ఐపిఎస్ ఆదేశాలు మేరకు , బాపట్ల జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్ ఐపీఎస్ సూచనలు మేరకు గురువారం బాపట్ల ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా, బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ రాంబాబు , బాపట్ల అంబేద్కర్ సెంటర్ నందు మాదకద్రవ్యాలను పూర్తిస్థాయిలో నివారించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. చాలామంది యువత మాదకద్రవ్యాల బారిన పడి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని, తల్లితండ్రులు వారి పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించి వారి నడవడికను గుర్తించాలన్నారు. ఎక్కడైనా ఎవరైనా విద్యార్థులు చిన్నారులు మాదక ద్రవ్యాలు సేవిస్తున్నట్లు మీ దృష్టికి వస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. తమ పిల్లలు కాదుగా తమకు ఎందుకులే అనుకునే భావనతో ప్రజలు ఉండవద్దని రానున్న రోజుల్లో తమ పిల్లలు కూడా డ్రగ్స్ కు అలవాటై ఇబ్బంది పడితే ఆ బాధలు తెలుస్తాయన్నారు. ఇప్పటికే అనేకమందిని గుర్తించి ఈగల్ టీం ఆధ్వర్యంలో వారికి కౌన్సిలింగ్ చేసి యువతలో మార్పు తీసుకు వస్తున్నామని, మాదకద్రవ్యాలు ఎక్కడైనా విక్రయిస్తున్న సేవిస్తున్న మాకు *1972 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సమాచారం అందించాలని కోరారు డ్రగ్స్ వద్దు బ్రో అనే నిన్నదాని అందరిచేత పలికించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల టౌన్ పోలీస్ సిబ్బంది మరియు ఈగల్ టీమ్ పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News