Saturday, March 14, 2026

*జిల్లాలో ఎటు వంటి ప్రాణ,ఆస్తి నష్టం జరుగకుండా తగు ముందస్తు చర్యలు చేపట్టాలి** లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి* సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్ల కుండా చూడాలి * వర్షంలో విద్యుత్ స్థంభాలను తాకరాదు* ప్రజలు వాగులు వంకలు వద్దకు వెళ్లారాదు* జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్.

నేటి సాక్షి,బాపట్ల జిల్లా ప్రతినిధి జిల్లాలో ఎటు వంటి ఆస్తి,ప్రాణ నష్టం జరుగకుండా తగు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. గురువారం బాపట్ల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ మండల, గ్రామ స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎటు వంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా తగు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెరువు గట్లను పటిష్టపర్చాలని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మైనర్ ఇరిగేషన్ చెరువుల వద్ద అధికారులు నియమించి, సముద్రంలో వేటకు వెళ్లిన 42 మంది జాలర్లను సురక్షితంగా తిరిగి ఇంటికి చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలని, ఎరువుల నిల్వలను యాప్‌లో అప్డేట్ చేయించాలని, ఇ. పంటల నమోదు పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే, గృహ నిర్మాణ శాఖ ద్వారా నిర్మించిన గృహాలను త్వరలో ప్రారంభించడానికి సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎటు వంటి ప్రాణ, ఆస్థి నష్టం జరుగకుండా అధికారులు, ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని చూచించారు. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్ల కుండా చూడాలని, శిథిలావస్థలో ఉన్న గృహాల్లో నివసిస్తున్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలాలని, వర్షంలో విద్యుత్ స్థంభాలను తాకరాదు అని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 08643-220226 నంబర్‌లో కాంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పంచాయతీ, వ్యవసాయ, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News